Google Pixel
Google Pixel | భారత్‌లో గూగుల్‌ స్టోర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్:Google Pixel | గూగుల్‌(Google) సంస్థ భారత్‌లో ఇక నేరుగా తన ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆన్‌లైన్‌ గూగుల్‌ స్టోర్‌ను ప్రారంభించింది. గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లతో పాటు గూగుల్‌కు సంబంధించిన ఇతర ఉత్పత్తులను ఇప్పటివరకు ఇతర ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫాంల ద్వారా విక్రయిస్తోంది. అయితే తన ఉత్పత్తుల(Products)ను వినియోగదారులకు మరింత చేరువ చేయాలని యోచిస్తున్న కంపెనీ.. భారత్‌లో తన ఆన్‌లైన్‌ స్టోర్‌(Online store in India)ను గురువారం అధికారికంగా ప్రారంభించింది.

వినియోగదారులు ఇక నేరుగా గూగుల్‌ వెబ్‌సైట్‌ ద్వారా గూగుల్‌కు సంబంధించిన ఫోన్(Phones)లు, గడియారాలు, ఫోన్‌ కేసులు, చార్జర్లు, ఈయర్‌ బడ్స్‌ వంటి గాడ్జెట్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాగా గూగుల్‌ ఇప్పటికే లాంచింగ్‌ ఆఫర్ల(Launching offers)నూ ప్రకటించింది.

గూగుల్‌ ఇండియా స్టోర్‌లో డిస్కౌంట్లతోపాటు గూగుల్‌ స్టోర్‌ క్రెడిట్స్‌, తక్షణ క్యాష్‌బ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ వంటి సదుపాయాలను కూడా అందిస్తున్నట్లు తెలిపింది. గూగుల్‌ స్టోర్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాం ద్వారా శాంసంగ్‌, యాపిల్‌ తదితర ఫోన్లను ఎక్స్ఛేంజ్‌ (Exchange) చేసి గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఉచిత డోర్‌స్టెర్‌ పికప్‌, రిపేర్‌ సర్వీస్‌లను అందించనున్నట్లు ప్రకటించింది.

Google Pixel | నో కాస్ట్‌ ఈఎంఐ సౌలభ్యం కూడా..

గూగుల్‌ స్టోర్‌ వినియోగదారులను ఆకర్షించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు(HDFC Credit cards)లపై నో కాస్ట్‌ ఈఎంఐ సౌలభ్యాన్ని కూడా అందిస్తోంది. తన స్టోర్‌ ద్వారా గూగుల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు 24 నెలల వరకు ఈఎంఐ(EMI) సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. పిక్సెల్‌ ఫోన్లపై గరిష్టంగా 24 నెలల పాటు ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్న గూగుల్‌.. పిక్సెల్‌ బడ్స్‌ ప్రో 2, పిక్సెల్‌ వాచ్‌ 3 వంటి వాటిపై 12 నెలలపాటు నోకాస్ట్‌ ఈఎంఐ సౌలభ్యాన్ని కల్పిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ జూన్‌ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. గూగుల్‌ కంపెనీ త్వరలోనే ఆఫ్‌లైన్‌ స్టోర్లనూ తెరిచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.