అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ప్రధాన సూచీలు మొదటి అరగంట మినహా మిగతా రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 168 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. వెంటనే కోలుకుని లాభాల బాట పట్టింది. ఇంట్రాడేలో గరిష్టంగా 65 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుని రోజంతా స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగింది. నిఫ్టీ(Nifty) 21 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైనా కొద్దిసేపటికే 30 పాయింట్లు లాభపడిరది. అక్కడినుంచి 145 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 182 పాయింట్ల నష్టంతో 81,451 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 24,750 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈలో 1,826 కంపెనీలు లాభపడగా 2,160 స్టాక్స్ నష్టపోయాయి. 133 కంపెనీలు ఫ్లాట్(Flat)గా ముగిశాయి. 109 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 43 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 4 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ. 2.12 లక్షల కోట్లకుపైగా తగ్గింది.
అమెరికా సుంకాల విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ట్రంప్ విధించిన సుంకాల(Trump tariffs) విషయంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును యూఎస్ ఫెడరల్ అప్పీల్ కోర్టు నిలిపివేయడంతో గ్లోబల్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. అలాగే ఈ రోజు మన దేశానికి సంబంధించిన గత ఆర్థిక సంవత్సరం జీడీపీ డాటా వెలువడనున్నాయి. అలాగే వారాంతం కూడా కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
Stock Market | స్మాల్ క్యాప్ ఇండెక్స్ మినహా..
బీఎస్‌ఈలో స్మాల్ క్యాప్(Small cap) ఇండెక్స్ మాత్రమే లాభాలతో ముగిసింది. పీఎస్‌యూ బ్యాంక్(PSU bank) ఇండెక్స్ మూడు శాతానికిపైగా, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.62 శాతం పెరిగాయి. బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు మినహా మిగతా ప్రధాన రంగాల షేర్లు నష్టాలతో ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, కన్జూమర్ డ్యూరెబుల్, ఆటో, టెలికాం ఇండెక్స్‌లు భారీగా పతనమయ్యాయి.
Stock Market | Top losers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో.. 24 కంపెనీలు మాత్రమే నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా (Tech Mahindra)1.73 శాతం నష్టపోగా.. హెచ్‌సీఎల్ టెక్ 1.64 శాతం, ఆసియా పెయింట్ 1.62 శాతం, ఎన్టీపీసీ 1.49 శాతం, ఇన్ఫోసిస్ 1.43 శాతం, నెస్లే, టాటా స్టీల్ 1.29 శాతం నష్టపోయాయి.
Stock Market | Gainers..
ఎటర్నల్(Eternal) అత్యధికంగా 4.58 శాతం లాభపడిరది. ఎస్‌బీఐ 1.89 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.81 శాతం, ఎల్‌అండ్‌టీ 0.64 శాతం పెరిగాయి.