Gaddar Awards
Gaddar Cinema Awards | 2014 నుండి 2017 వ‌ర‌కు తెలంగాణ గద్దర్ సినిమా అవార్డ్స్ ప్ర‌క‌ట‌న‌

అక్షరటుడే, వెబ్​డెస్క్:Gaddar Cinema Awards | గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఎలాంటి అవార్డ్స్ ప్ర‌క‌టించ‌డం లేదు. అయితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress government) అధికారంలోకి వ‌చ్చాక విప్ల‌వ నాయ‌కుడు గ‌ద్ద‌ర్ పేరుతో గ‌ద్ద‌ర్ అవార్డ్స్ ని ప్రకటించింది.

దాదాపు 11 యేళ్ల తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కార్.. ప్రజా యుద్ద నౌక గద్దర్ పేరిట అవార్డులు ఇస్తుంది. 2024 ఏడాదికి గాను విన్నర్స్ లిస్ట్ ను ప్రకటించింది. తాజాగా తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి 2023 వరకు వరుసగా పదేళ్లకు సంబంధించిన అవార్డులను జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్(Jury Chairman Murali Mohan) ప్రకటించారు.

Gaddar Cinema Awards | అవార్డులు ఇలా..

2014 రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు శీను

2015 రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు

2016 శతమానం భవతి, పెళ్లిచూపులు, జనతా గ్యారేజ్

2017 బాహుబలి కంక్లూజన్, ఫిదా, ఘాజీ

2018 మహానటి, రంగస్థలం, కేరాఫ్ కంచర్ల పాలెం

2019 మహర్షి, జెర్సీ, మల్లేశం

2020 అల వైకుంఠపురములో, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్

2021 ఆర్ఆర్ఆర్, అఖండ, ఉప్పెన

2022 సీతారామం, కార్తికేయ 2, మేజర్

2023 బలగం, హనుమాన్, భగవంత్ కేసరిలకు ఉత్తమ ప్రథమ, ద్వితీయ, తృతీయ చిత్రాలను ప్రకటించారు.

స్పెషల్ జ్యూరీ అవార్డుల విషయానికొస్తే..

ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్- నందమూరి బాలకృష్ణ

పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్-మణిరత్నం

బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్- సుకుమార్

చక్రపాణి అవార్డ్- అట్లూరి పూర్ణచందర్ రావు

కాంతారావు అవార్డ్- విజయ్ దేవరకొండ

2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం.. మూడు సినిమాలకు అవార్డులు ప్రకటిస్తున్నాం అని జ్యూరీ సభ్యులు తెలియ‌జేశారు. అలానే గద్దర్ అవార్డులతో పాటు ఎన్టీఆర్ NTR, పైడి జయరాజు.. ఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు.. రఘుపతివెంకయ్య అవార్డులు కూడా ప్రకటించామని తెలిపారు.