ePaper
More
    HomeతెలంగాణJurala Project | జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద

    Jurala Project | జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jurala Project | వర్షాకాలం ప్రారంభం కాకముందే జూరాల ప్రాజెక్ట్​కు భారీ వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy Rains) రెండు రోజులుగా ప్రాజెక్ట్​లోకి భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. గురువారం గరిష్టంగా 80 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చింది. శుక్రవారం సైతం జలాశయానికి వరద కొనసాగుతోంది.

    Jurala Project | 8 గేట్లు ఎత్తివేత

    జూరాల ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి పూర్తి నీటిమట్టం 318.516 (9.657 టీఎంసీలు) మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.510 (7.663 టీఎంసీలు) మీటర్ల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో గురువారం 12 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. శుక్రవారం ఎనిమిది గేట్ల ద్వారా దిగువకు నీరు వదులుతున్నారు.

    కాగా.. గత 18 ఏళ్ల కాలంలో మే నెలలో జూరాల ప్రాజెక్ట్ (Jurala Project)​ గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దిగువకు నీటిని వదులుతుండటంతో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 72 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా.. 72,194 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఈ నీరు శ్రీశైలం ప్రాజెక్ట్​లోకి చేరనుంది.

    More like this

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...

    CM Revanth Reddy | రాజ్​నాథ్​సింగ్​ను కలిసిన సీఎం.. రక్షణ శాఖ భూములు కేటాయించాలని వినతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి బుధవారం రక్షణ...

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...