ePaper
More
    HomeజాతీయంMaoists | మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి ముగ్గురికి గాయాలు

    Maoists | మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి ముగ్గురికి గాయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Maoists | మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్(Chhattisgarh)​ రాష్ట్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

    ఆపరేషన్​ కగార్​(Operation Kagar)తో భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. మావోయిస్టులకు సేఫ్​ జోన్​గా ఉన్న అటవీ ప్రాంతాల్లో సైతం బలగాలు పట్టు సాధిస్తున్నాయి. నిత్యం ఎన్​కౌంటర్లు చేస్తూ మావోలను కోలుకోనివ్వడం లేదు. దీంతో బలగాల నుంచి రక్షించుకోవడానికి మావోయిస్టులు మందుపాతరలను పెడుతున్నారు. అడవుల్లో ఐఈడీ(IED)లు అమరుస్తున్నారు.

    ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్ స్టేషన్(Maddedu Police Station) పరిధిలో పొలం పనులకు వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఎర్రగుఫా గ్రామానికి చెందిన గోటే జోగా(45), నాగయ్య (17), బద్దె సునీల్ (20) గా గుర్తించారు. వీరు పొలం పనుల కోసం బందేపార గ్రామానికి వెళ్తుండగా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ ఐఈడీ (Pressure IED) పేలి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బలగాలు వారిని ఆస్పత్రికి తరలించాయి.

    Maoists | మావోల మందుపాతరల వ్యూహం

    ఆపరేషన్​ కగార్​తో కకావికలం అవుతున్న మావోలు మందుపాతరతో వారిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇటీవల తెలంగాణ–ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని కర్రెగుట్ట(Karregutta)ల్లో సైతం భారీగా బాంబులు పెట్టామని, ప్రజలు అటువైపు రావొద్దని మావోయిస్టులు లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం వేల సంఖ్యల్లో బలగాలు కర్రెగుట్టల్లో ఆపరేషన్​ కగార్​ చేపట్టాయి.


    ఈ క్రమంలో ఎన్​కౌంటర్లలో పలువురు మావోలు మృతి చెందగా.. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల బంకర్లను ధ్వంసం చేశారు. అయితే ఈ ఆపరేషన్​లో ఒక ఐఈడీ పేలి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. అందులో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్​ కూడా ఉన్నారు. తాజాగా మావోలు అమర్చిన ప్రెషర్​ ఐఈడీ పేలి ముగ్గురు గాయపడ్డారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...