PM modi
PM Modi | మోదీని కలిసిన వైభవ్​ సూర్యవంశీ

అక్షరటుడే, వెబ్​డెస్క్:PM modi | ప్రధానమంత్రి నరేంద్రమోదీని 14 క్రికెటర్​ వైభవ్​ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) కుటుంబంతో సహా కలిశాడు. మోదీ శుక్రవారం బీహార్​లో పర్యటించారు.

ఈ సందర్భంగా పాట్నా ఎయిర్​పోర్టు (Patna Airport) వద్ద చిచ్చర పిడుగు వైభవ్​ తన తల్లిదండ్రులతో పాటు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలను మోదీ తన ఎక్స్​ ఖాతాలో పంచుకున్నారు. వైభవ్​ సూర్యవంశీ ప్రతిభను ఆయన ప్రశంసించారు. భవిష్యత్​లో మరింత రాణించాలని ఆకాంక్షించారు.

కాగా.. చిన్న వయస్సులో క్రికెటర్​గా ఎదిగిన సూర్యవంశీ తాజా ఐపీఎల్​(IPL)లో అరంగేట్రం చేశాడు. రాజస్థాన్​ రాయల్స్ (Rajasthan Royals)​ తరఫున ఆడిన ఈ చిచ్చర పిడుగు తన తొలి మ్యాచ్​లోనే 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. గుజరాత్​ జరిగిన మ్యాచ్​లో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 40, సీఎస్​కేతో 57 పరుగులు చేశాడు. మొత్తం ఐపీఎల్​లో ఏడు మ్యాచ్​లు ఆడిన వైభవ్​ 252 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.