ePaper
More
    HomeజాతీయంMinister Rajnath Singh | మ‌సూద్‌, హ‌ఫీజ్‌ల‌ను అప్ప‌గించాల్సిందే.. పాక్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌

    Minister Rajnath Singh | మ‌సూద్‌, హ‌ఫీజ్‌ల‌ను అప్ప‌గించాల్సిందే.. పాక్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Minister Rajnath Singh | ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న పాకిస్తాన్‌(Pakistan)కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

    పాక్ దేశంలో ఉన్న క‌రుడు గ‌ట్టిన ఉగ్రవాదులు మసూద్ అజార్ (Masood Azhar), హఫీజ్ సయీద్‌(Hafiz Saeed)లను భారతదేశానికి అప్పగించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్‌ను రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సందర్శించారు. ప్ర‌ధానంగా భారత నావికాదళం తన బలాన్ని, వ్యూహాత్మక సామర్థ్యాన్ని నిరూపించుకున్న ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అద్భుతమైన విజయం తర్వాత ఆయన INS విక్రాంత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి.

    ఐఎన్‌ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకలో జరిగిన సమావేశంలో సింగ్ నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా పాక్‌కు హెచ్చ‌రిక‌లు చేసిన ఆయ‌న‌.. ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోయ‌డం ఆపాల‌ని హిత‌వు ప‌లికారు. స్వాతంత్య్రం ముగిసినప్పటి నుండి పాకిస్తాన్ ఆడుతున్న ఆ ప్రమాదకరమైన ఉగ్రవాద ఆటను స్పష్టంగా అర్థం చేసుకోవాలన్నారు. “తన గడ్డపై పనిచేస్తున్న ఉగ్రవాద నర్సరీలను తన చేతులతోనే పెకలించడం పాకిస్తాన్‌కు ప్ర‌యోజ‌న‌క‌రమ‌ని” అని రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సూచించారు.

    ఉగ్రవాదంపై భారతదేశం జీరో-టాలరెన్స్(Zero-tolerance) వైఖరిని ఆయ‌న పునరుద్ఘాటింటారు. ముప్పును ఎదుర్కోవడానికి దేశం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తుందని స్ప‌ష్టం చేశారు. “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ ఆలోచించగల ప్రతి పద్ధతిని ఉపయోగిస్తాము, పాక్ ఆలోచించలేని వాటిని ఉపయోగించడానికి కూడా వెనుకాడము” అని ఆయన ప్రకటించారు.

    Latest articles

    Nizamsagar Project | ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం..

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం వెలికితీయించారు. నిజాంసాగర్​ పోలీసులు...

    Skin Beauty | వంటిల్లే చ‌ర్మ‌సౌంద‌ర్య నిల‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Skin Beauty | చ‌ర్మ సౌంద‌ర్య కోసం అందరూ పాకులాడ‌తారు. అందంగా క‌నిపించాల‌ని భారీగా డ‌బ్బులు...

    Mla Dhanpal | ఓటుచోరీ పేరుతో రాహుల్​గాంధీ డ్రామాలు : ఎమ్మెల్యే ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | ఓటు చోరీ పేరిట రాహుల్ గాంధీ (Rahul Gandhi) డ్రామాలు చేస్తున్నారని...

    Mahavatar Varsimha | ఎలాంటి ప‌బ్లిసిటీ లేదు.. అయిన మ‌హావ‌తార్ న‌ర‌సింహ ప్ర‌భంజ‌నం ఆగ‌డం లేదుగా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahavatar Varsimha | హిందూ పురాణాల ఆధారంగా రూపొందిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ (mahavathar...

    More like this