ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | కేసీఆర్‌ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోను: ఎమ్మెల్సీ కవిత

    MLC Kavitha | కేసీఆర్‌ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోను: ఎమ్మెల్సీ కవిత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:MLC Kavitha | బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన ఆమె శుక్రవారం మంచిర్యాలలో మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు.

    తన లేఖను లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలి అని ఆమె డిమాండ్​ చేశారు. కాగా ఇటీవల తన తండ్రి కేసీఆర్(KCR)​కు ఆమె రాసిన లేఖ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ను బీజేపీ(BJP)లో కలపాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీని నడపడం చేతకాని వారు తనకు నీతులు చెప్పొద్దని పరోక్షంగా కేటీఆర్(KTR)​ను ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి కేటీఆర్​ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని ఆమె పరోక్షంగా తెలిపారు.

    MLC Kavitha | పార్టీని కాపాడుకోవడమే అజెండా

    తనకుంటు ప్రత్యేకంగా జెండా.. అజెండా ఏమి లేవని కవిత(MLC Kavitha) అన్నారు. పార్టీని కాపాడుకోవడమే తన అజెండా అని ఆమె పేర్కొన్నారు. బీజేపీ వైపు బీఆర్ఎస్ చూడొద్దని ఆమె సూచించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదని కవిత పేర్కొన్నారు. బీజేపీలో (BRS)ను విలీనం చేస్తామంటే ఒప్పుకోనని ఆమె స్పష్టం చేశారు.

    MLC Kavitha | ఆవేదనతో లేఖ రాశా

    పార్టీలో ఎన్నో ఆవేదనలు భరించాక తన తండ్రికి లేఖ రాశానని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అన్నారు. లెటర్ రాయడంలో తన తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. లెటర్‌ను బయటకు తెచ్చినవారిని పట్టుకోండని ఆమె అన్నారు. కేసీఆర్​ను కలిసే అవకాశం వచ్చినా కలవలేకపోయానని తెలిపారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...