ePaper
More
    HomeతెలంగాణJagadish Reddy | కేసీఆర్​ను ప్రశ్నిస్తే నష్టపోతారు.. జగదీశ్​​రెడ్డి కీలక వ్యాఖ్యలు

    Jagadish Reddy | కేసీఆర్​ను ప్రశ్నిస్తే నష్టపోతారు.. జగదీశ్​​రెడ్డి కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jagadish Reddy | బీఆర్​ఎస్​ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీని నడపడం రాని వారు తనకు నీతులు చెబుతున్నారని ఆమె పరోక్షంగా కేటీఆర్​(KTR)పై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి(Former Minister Jagadish Reddy) స్పందించారు. బీజేపీలో బీఆర్​ఎస్​ను విలీనం చేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఆ పార్టీతో పొత్తు కూడా ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్‌(KCR)ను ప్రశ్నిస్తే నష్టపోతారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

    కవిత వ్యాఖ్యలతో గులాబీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే పార్టీలోని నేతలు రెండుగా విడిపోయారు. కొందరు కవితకు మద్దతు తెలుపుతున్నారు. బీఆర్​ఎస్​ రజతోత్సవ సభతో మంచి ఉత్సాహంగా ఉన్న బీఆర్​ఎస్(BRS)​పై కవిత తన వ్యాఖ్యాలతో నీళ్లు చల్లారు. మరోవైపు రాష్ట్రంలో కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో జగదీశ్​ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ అధినాయకుడు, తెలంగాణ(Telangana)కు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.

    Jagadish Reddy | చంద్రబాబుకు కౌంటర్​

    ఆంధ్ర ప్రదేశ్​(Andhra Pradesh)లోని కడపలో జరిగిన టీడీపీ మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మాట్లాడుతూ.. హైదరాబాద్​ను తాను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. బాబు మాటలకు మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి(Hyderabad Development)కి తానే కారణం అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

    చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయని, అలానే మోస పూరితంగా ఉంటాయని ఆరోపించారు. ఏపీని 2014 నుంచి 2019 వరకు పాలించిన చంద్రబాబు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రాలు విడిపోయాక తెలంగాణ తలసరి ఆదాయం పెరిగితే, ఏపీది పెరగలేదన్నారు. మరి తన ఐదేళ్ల పాలనలో బాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...