అక్షరటుడే, నిజామాబాద్ సిటీ :Nizamabad News | నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి(Private hospital)లో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూరు మండలం పడిగల్ గ్రామానికి చెందిన కవిత(32)ను నగరంలోని హైదరాబాద్ రోడ్డు(Hyderabad Road)లో గల ఓ ఆస్పత్రికి గురువారం తీసుకొచ్చారు. కవితకు స్పైనల్ ప్రాబ్లం ఉందని, ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆమె భర్త సురేష్ డాక్టర్ల సూచన మేరకు ఆపరేషన్ కు సిద్ధమయ్యారు.
గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డాక్టర్లు ఆపరేషన్ చేశారని సురేష్ పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం వెంటిలేటర్‌పై ఉంచారని, శుక్రవారం ఉదయం మృతి తన భార్య మృతి చెందిందని చెప్పారని ఆయన వాపోయాడు. ఆపరేషన్ చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతోనే తన భార్య మృతి చెందిందని ఆరోపించాడు. ఘటన స్థలానికి నిజామాబాద్ సీఐ శ్రీనివాస్ రాజు(CI Srinivas Raju), ఎస్సైల చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై వివరాలు సేకరించారు.