ePaper
More
    Homeఅంతర్జాతీయంCar Service | కార్ సర్వీస్‌కి రూ.7 ల‌క్ష‌లా.. అంత స్పెష‌ల్ ఏంటి..?

    Car Service | కార్ సర్వీస్‌కి రూ.7 ల‌క్ష‌లా.. అంత స్పెష‌ల్ ఏంటి..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Car Service | సాధార‌ణంగా మ‌నం కార్ వాట‌ర్ స‌ర్వీస్ ఇస్తే 1000 రూపాయ‌లు లోపు అయిపోతుంది. కాని ఈ వ్య‌క్తి మాత్రం దాదాపు ఏకంగా రూ.7ల‌క్ష‌ల(Rs seven lakhs) వ‌ర‌కు తీసుకుంటాడ‌ట‌..!

    ప్రపంచంలో కార్లపై ఉన్న ప్రేమకు అంతులేదు. కానీ ఒక కార్ సర్వీస్‌కి రూ.7 లక్షలు ఖర్చు చేస్తారా? అంటే న‌మ్మ‌కత‌ప్ప‌దు. అంత కాస్ట్‌లీ కార్ వాషర్ పాల్ డాల్టన్ (Paul Dalton). ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్ డీటెయిలింగ్ ప్రేమికులకు సుపరిచితమే. పాల్ డాల్టన్ బ్రిటన్‌కు చెందిన ప్రొఫెషనల్ కార్ డీటైలర్. అతని ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, నాణ్యమైన కార్ల శుభ్రత సేవలు అందించడం. ఆయన “Miracle Detail ” అనే సొంత బ్రాండ్ ద్వారా హై-ఎండ్ క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నాడు.

    Car Service | అంత ఖ‌రీదా..

    పాల్ డాల్టన్ అందించే “Signature Detail” ప్యాకేజ్‌కి దాదాపు £7,000 – £8,000 (భారత రూపాయలలో సుమారు 7 లక్షలు) ఖర్చవుతుంది. 30 ఏళ్ల ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న ఇత‌ను కార్ స‌ర్వీస్ (Car Service) చేయ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్‌. ఇత‌నితో కార్ వాష్ చేయించుకునేందుకు నెల‌ల త‌ర‌బ‌డి మిలియ‌నీర్స్ వెయిట్ చేయిస్తుంటారు.

    కొత్త కారు కొన్న‌ప్పుడు ఎంత కొత్త‌గా ఉంటుందో, అతను వాష్ చేశాక దాన్ని మించి ఉంటుంద‌ట‌. బాడీపై స్పెషల్ క్లే బార్ ట్రీట్మెంట్ , సూపర్ మైక్రోఫైబర్ పాలిషింగ్, ప్రత్యేకమైన వాక్స్ (కార్నుబా వాక్స్ – world’s purest wax), ఇంటీరియర్ డీప్ క్లీనింగ్, ఇంజిన్ బే క్లీనింగ్, పెయింట్ కరెక్షన్ & swirl removal వంటివి చేస్తాడ‌ట‌.

    సాధారణ కార్ వాష్ కంటే అత‌ని స‌ర్వీస్ చాలా భిన్నమైనది. ప్రతి కార్‌కి 100+ గంటల పని ఖర్చవుతుంది. పాల్ డాల్టన్ వాడే వాక్స్ ఒక్కటే రూ.లక్షల విలువైనదిగా చెప్పబడుతోంది. బెంట్లీ, ఫెరారీ, బుగట్టి వాడే వ్యక్తులు, సెలబ్రిటీలు(Celebrities), రాయల్టీ, కార్ కలెక్టర్లు(Collectors) అత‌ని వ‌ద్దకు వ‌స్తుంటారు.

    పాల్ డాల్టన్ చేసిన కార్లు మినిమమ్ ఒక సంవత్సరం దాకా డస్ట్ రిపెల్లెంట్‌గా ఉండగలవు. అంటే మీ కారు ఎప్పటికీ కొత్త కార్‌లా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో, ఆయన చేత శుభ్రం చేయించుకోవడానికి వారాల తరబడి వేటింగ్ ఉంటుంది. రూ.7 లక్షలు ఒక కార్ వాషింగ్‌కి అంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ పాల్ డాల్టన్(Paul Dalton) చేసిన పనిని చూస్తే… అంత పెట్టొచ్చు అని అనిపిస్తుంది.. అని టాక్.

    More like this

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...

    Turmeric Milk | రోజూ పసుపు పాలు తాగితే ఇన్ని లాభాలా..

    అక్షరటుడే, హైదరాబాద్ : Turmeric Milk | భారతీయ సంప్రదాయంలో పసుపు పాలకు (గోల్డెన్ మిల్క్) ఒక ప్రత్యేక...

    Bajireddy Govardhan | జర్నలిస్ట్ నారాయణ మృతదేహానికి బాజిరెడ్డి నివాళి

    అక్షరటుడే, డిచ్​పల్లి: Bajireddy Govardhan | మండలంలోని ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ లక్కవత్రి నారాయణ (Lakkavatri Narayana) గుండెపోటుతో...