Food Items
Food Items | ఫ్రిడ్జిలో అస్స‌లు పెట్ట‌కూడ‌ని వ‌స్తువులు ఏంటో మీకు తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్:Food Items | ఈ రోజుల్లో రిఫ్రిజిరేట‌ర్(Refrigerator) లేని ఇల్లు లేదంటే అతిశ‌యోక్తి కాదు. అందరి ఇళ్లలో రిఫ్రిజిరేటర్ వాడకం తప్పనిసరిగా మారింది. వాటర్ బాటిళ్ల నుంచి మొదలు.. తినే పదార్థాలు, కూరగాయలు (Vegetables)వంటివి నిల్వచేసుకునేందుకు సీజన్​తో సంబంధం లేకుండా అందరూ ఫ్రిజ్(Fridge)​ను ఉప‌యోగిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక ఫ్రిజ్ లో వండినవి, వండని కూరగాయలు వంటివి పచ్చి కూరగాయలను నిల్వ చేయడం చేస్తూ ఉంటాం. మసాలా దినుసుల నుండి డ్రై ఫ్రూట్స్(Dry fruits), నట్స్(nuts), ఫ్రూట్స్(fruits) వరకు మన చేతికి దొరికినవి ఫ్రిడ్జ్‌లో పెడుతుంటాము. కానీ, ఇలా ఏదిపడితే అది ఫ్రిజ్‌లో పెడితే కొన్ని వస్తువులు పాడవుతాయని మీకు తెలుసా..? ఫ్రిజ్‌లో ఉంచకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి.

Food Items | ఫ్రిడ్జ్‌లో వాటిన పెట్ట‌కూడ‌దు..

అస్సలు ఫ్రిజ్ లో పెట్టకూడని వస్తువుల్లో మొట్టమొదట ఉండేది బ్రెడ్(Bread). ఎలాంటి బ్రెడ్ అయినా దాన్ని ఫ్రిజ్ లో పెట్టకూడదు. వెజిటేబుల్, ఆలివ్, కొబ్బరి, ఇతర వంట నూనెల‌ను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అవి కనుక అందులో పెడితే గట్టి పడిపోతాయి. నూనెలే కాదు తెనె కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.చల్లని ఉష్ణోగ్రతలు కూడా వెల్లుల్లిని (Garlic)మృదువుగా చేస్తాయి. వెల్లుల్లి రుచిని మారిపోతుంది. కాబట్టి, వీటిని కూడా ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. దీని వల్ల ఇబ్బందిగా మారుతుంది. టమాటల్ని(Tomatoes) కూడా ఫ్రిజ్‌లో పెడితే వాటి రుచి, ఆకృతి పాడైపోతుంది. కాబట్టి, వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయకపోవడం మంచిది. ఇందులోని తేమ కారణంగా ఉల్లిపాయలు మెత్తగా మారతాయి.

బంగాళాదుంప(Potatoes)లని కూడా మిగతా కూరగాయల్లా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. దీని వల్ల అందులోని పిండి పదార్థాలు విచ్ఛిన్నమవుతాయి.కాఫీ స్టోర్ చేసే విధానంపై కూడా దాని రుచి ఆధారపడి ఉంటుంది. అందుకే, దీనిని ఫ్రిజ్‌లో పెట్టకుండా బయటే వెలుగు రాని చోట ఓ కంటెయినర్‌లో పెట్టడం మంచిది. అరటిపండ్లని ఎప్పటికీ అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అందులో పెట్టడం వల్ల రుచి కోల్పోయి నిర్జీవంగా మారతాయి. అందుకే వాటిని రూమ్‌ టెంపరేచర్‌లోనే ఉంచాలి. రిఫ్రిజిరేటర్‌లో Refrizirator తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది కుంకుమపువ్వు దారాలను మృదువుగా, జిగటగా మార్చేస్తుంది. కొన్నిసార్లు కుంకుమపువ్వు కూడా ఎండిపోతుంది. అందుకే ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు. పెరుగును కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని అంటున్నారు. ఇలా పెరుగును ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు తప్ప‌వ‌ని నిపుణులు చెబుతున్నారు