ePaper
More
    Homeబిజినెస్​PRE MARKET ANALYSIS | నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    PRE MARKET ANALYSIS | నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PRE MARKET ANALYSIS : యూఎస్‌ మార్కెట్లు (US Markets) గత ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాలతో ముగిసినా యూరోప్‌, ఆసియా మార్కెట్లలో మాత్రం సెల్లాఫ్‌ కనిపిస్తోంది. గురువారం అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ 0.40 శాతం, నాస్‌డాక్‌ (Nasdaq) 0.39 శాతం పెరిగాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది.

    PRE MARKET ANALYSIS : యూరోప్‌ మార్కెట్లు..

    యూరోపియన్‌ మార్కెట్లు(European markets) గత ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. డీఏఎక్స్‌(DAX) 0.44 శాతం నష్టపోగా, ఎఫ్‌టీఎస్‌ఈ, సీఏసీలు 0.11 శాతం మేర నష్టపోయాయి.

    PRE MARKET ANALYSIS : ఆసియా మార్కెట్లు..

    ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో హంగ్‌సెంగ్‌(Hang Seng) 1.71 శాతం నష్టపోగా.. నిక్కీ 1.43 శాతం, కోస్పీ 0.55 శాతం, షాంఘై 0.46 శాతం, స్ట్రెయిట్‌ టైమ్స్‌ 0.24 శాతం నష్టంతో కదలాడుతోంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 005 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    PRE MARKET ANALYSIS : గమనించాల్సిన అంశాలు..

    • ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(Institutional investors) వరుసగా ఆరో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నెట్‌ బయ్యర్లుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 884 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐ(DII)లు నికరంగా రూ. 4,286 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర స్వల్పంగా తగ్గింది. బ్యారెల్‌కు 0.50 శాతం తగ్గి 62.63 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు క్షీణించి 85.51 వద్ద ఉంది.
    • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌(US dollar index) 99.42 వద్ద, యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ రేటు 4.42 వద్ద ఉన్నాయి.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.76నుంచి 0.86 కు పెరిగింది. విక్స్‌(VIX) 8.87 శాతం తగ్గి 16.42 వద్ద నిలిచింది. పీసీఆర్‌ పెరగడం, విక్స్‌ తగ్గడం బుల్స్‌కు అనుకూలాంశం.
    • యూఎస్‌(US)లో నిరుద్యోగ రేటు పెరుగుతుండడం, జీడీపీ వృద్ధి రేటు అంచనాలకన్నా తక్కువ నమోదు కావడంతో అమెరికాలో ఆర్థిక మందగమనం ఏర్పడవచ్చన్న అంచనాలున్నాయి.

    అత్యవసర అధికారాల చట్టం కింద అమెరికా అధ్యక్షుడు(US President) ఇతర దేశాలపై సుంకాలు విధించకుండా యూఎస్‌కు చెందిన దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఫెడరల్‌ అప్పీల్‌ కోర్ట్‌(Federal Appeals Court) నిలిపివేసింది. పరస్పర సుంకాలను తాత్కాలికంగా పునరుద్ధరించడంతో వాల్‌స్ట్రీట్‌(Wall street) లాభాలతో ట్రేడ్‌ అవుతుండగా.. యూరోప్‌, ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...