ePaper
More
    HomeజాతీయంCredit Card | ఆధార్​ అప్​డేట్​.. క్రెడిట్​కార్డు రూల్స్.. జూన్​లో మార్పులివే..

    Credit Card | ఆధార్​ అప్​డేట్​.. క్రెడిట్​కార్డు రూల్స్.. జూన్​లో మార్పులివే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Credit Card | ఆర్థిక అంశాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవేంటో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మనం జూన్ నెలలో ప్రవేశించాం. ఈ నెలలో కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లకు సంబంధించిన మార్పులు చేశాయి. ఎఫ్ఏ వడ్డీ రేట్లను సవరించాయి. ఈపీఎస్ఓలోనూ మార్పులు వచ్చాయి. ఆధార్ ఉచిత అప్​డేట్​ గడువు కూడా ఈ నెలలోనే ముగియనుంది. ఇంకా ఏంటంటే..

    ఫిక్స్​డ్ డిపాజిట్స్(Fixed Deposits)..

    ఆర్బీఐ(RBI) రెపోరేటు(repo rate)ను తగ్గించడం వల్ల హెచ్ఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫీలపై వడ్డీ రేట్లను జూన్ 1 నుంచి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇతర బ్యాంకులు కూడా వడ్డీ సవరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

    ఈపీఎఫ్ 3.0(EPF 3.0)..

    ఉద్యోగ భవిష్య నిధి సంస్థ కీలక అప్​గ్రేడ్​కు సన్నద్ధమైంది. జూన్ నెలలో 3.0కు అప్​గ్రేడ్​ అవుతోంది. దీనివల్ల యూపీఐ, ఏటీఎం నుంచి నగదు విత్​డ్రా సదుపాయం అందుబాటులోకి రానుంది. క్లెయిమ్ ప్రక్రియ సైతం వేగవంతం కానుంది.

    సెబీ కటాఫ్ రూల్(SEBI Cutoff Rule)..

    ఓవర్​నైట్​ ఫండ్​కు సంబంధించి కటాఫ్ సమయంలో సెబీ మార్పులు చేసింది. నేటి(జూన్ 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఆఫ్​లైన్​ లావాదేవీలకు సంబంధించి మధ్యాహ్నం 3 వరకు వచ్చిన పెట్టుబడి అభ్యర్థనలకు అదే రోజు ముగింపు ఎన్ఏవీ వర్తించనుంది. తర్వాత వచ్చిన దరఖాస్తులకు మరుసటి వ్యాపార దినం ఎన్ఏవీ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. ఆన్​లైన్​ విధానంలో దరఖాస్తులను సాయంత్రం 7 గంటల వరకు అనుమతించనున్నారు.

    క్రెడిట్ కార్డు మార్పులు(Credit card changes) ఇలా..

    కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంపిక చేసిన కొన్ని క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లలో కోతను పెట్టింది. నేటి(జూన్ 1) నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చింది. యుటిలిటీస్, ఎడ్యుకేషన్, వాలెట్, ఫ్యూయల్, రెంట్ పేమెంట్, గవర్నమెంట్ చెల్లింపులు, ఇన్సూరెన్స్, ఆన్​లైన్​ గేమింగ్ వంటి విషయాల్లో కొన్నింటికి పూర్తిగా రివార్డు ప్రయోజనాలను నిలిపివేస్తున్నాయి. మరికొన్నింటికి పరిమితి విధిస్తున్నాయి.

    యాక్సిస్ బ్యాంక్ సైతం యుటిలిటీ, రెంట్, టెలీకాం, ఫ్యూయల్, ఇన్సూరెన్స్, వాలెట్, ఎడ్యుకేషన్ వంటి లావాదేవీలపై జూన్ 20 నుంచి రివార్డు ప్రయోజనాలను నిలిపివేయనుంది. రెంట్, వాలెట్ టాప్-అప్స్​ను వార్షిక ఫీజు మినహాయింపు పరిమితి నుంచి తప్పించనుంది.

    హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్.. టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డు హోల్డర్లకు లాంజ్ యాక్సెస్ సదుపాయంలో మార్పులు తీసుకొచ్చింది. ఒక త్రైమాసికంలో రూ.50 వేలు మించి కొనుగోలు చేసిన వారికే లాంజ్ యాక్సెస్ అందించనుంది. జూన్ 10 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది.

    వడ్డీ రేట్ల(Interest rate) ఊరట..

    ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ జూన్ 4, 5, 6 తేదీల్లో సమావేశం కాబోతోంది. ఆరో తేదీన నిర్ణయాలు వెలువడనున్నాయి. గత రెండు సమావేశాల్లో రెపో రేటును ఆర్బీఐ తగ్గించిన విషయం తెలిసిందే. మరోసారి సైతం ఊరట లభిస్తే.. గృహ, వాహన రుణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.

    ఆధార్ అప్​డేట్(Aadhaar update)​..

    ఆధార్ వివరాలను ఉచితంగా అప్​డేట్​ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు జూన్ 14తో ముగియబోతోంది. ప్రతి పదేళ్లకోసారి ఆధార్​ వివరాలను అప్​డేట్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత రుజువు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ‘మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. ఉచిత గడువు ముగిశాక గతంలో మాదిరిగా ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్​డేట్​ చేసుకోవాల్సి ఉంటుంది.

    ఎల్పీజీ సిలిండర్(LPG cylinder)..

    అంతర్జాతీయ మార్కెట్​కు అనుగుణంగా చమురు సంస్థలు దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. మేలో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. ఈసారి కూడా మార్పులుండొచ్చు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...