- Advertisement -
HomeతెలంగాణSajjanar | సివిల్స్​ ర్యాంకర్​ను అభినందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

Sajjanar | సివిల్స్​ ర్యాంకర్​ను అభినందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sajjanar | సివిల్స్‌లో(Civils) ప్ర‌తిభ క‌న‌బ‌రిచి 11వ‌ ర్యాంకు సాధించిన వ‌రంగ‌ల్‌కు చెందిన ఇట్ట‌బోయిన సాయి శివాని(Sai Shivani)ని ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ (RTC MC Sajjanar) అభినందించారు.

సాయి శివాని మేన‌మామ‌ ప్ర‌కాశ్ రావు ఆర్టీసీలో డీఎం హోదాలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో హైద‌రాబాద్‌లోని బ‌స్ భ‌వ‌న్‌ (Hyderabad Bus Bhavan)లో గురువారం ఆమె త‌న త‌ల్లిదండ్రులు రాజు, ర‌జిత‌తో క‌లిసి సజ్జనార్ ను కలిశారు. సాధార‌ణ కుటుంబానికి చెందిన సాయి శివాని.. సివిల్స్‌లో చిన్న వయ‌సులోనే అత్యుత్త‌మ ర్యాంకు సాధించి యువ‌త‌కు స్పూర్తిగా నిలిచార‌ని ఈ సందర్భంగా స‌జ్జ‌ననార్ కొనియాడారు.

- Advertisement -

ఈ డిజిట‌ల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా, సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా అనుకున్న ల‌క్ష్యాన్ని ఆమె సాధించార‌ని ప్ర‌శంసించారు. విధి నిర్వ‌హ‌ణ‌లో అంకిత‌భావంతో ప‌నిచేసి ఉన్నతంగా రాణించాల‌ని ఆమెకు సూచించారు. కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ మునిశేఖ‌ర్, సిరిసిల్ల డీఎం ప్ర‌కాశ్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News