Nigerians in hyderabad
Hyderabad | కావాలనే కేసులు పెట్టించుకుంటున్న నైజీరియన్లు.. ఎందుకో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్(Hyderabad)​ నగరంలోని పలు ప్రాంతాల్లో నైజీరియన్లు(Nigerians) నివసిస్తున్నారు. మెహదీపట్నం, లంగర్​హౌజ్​, సన్​సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో నైజీరియన్లు ఉంటున్న విషయం తెలిసిందే.

వీరిలో కొందరు అక్రమ మార్గంలో వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే వీరు ఇక్కడ ఎక్కువగా సైబర్​ నేరాలు(Cyber Crimes), డ్రగ్స్​ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలో నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్లను వారి దేశానికి పంపిస్తున్నట్లు(Deport) హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand)​ తెలిపారు. అయినా కూడా వారు మళ్లీ అక్రమ మార్గంలో నగరంలోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలా నకిలీ పాస్​పోర్టులతో వచ్చిన వారిని సైతం అరెస్ట్​ చేశామన్నారు.

Hyderabad | తప్పించుకోవడానికి.. కేసుల్లో ఇన్వాల్వ్​

నైజీరియన్లను వారి దేశానికి పంపుతుండటంతో పలువురు కావాలనే కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని సీపీ ఆనంద్ తెలిపారు. “ఇలా కేసుల్లో ఉన్న వారిని కేసు విచారణ పూర్తయ్యే వరకు వారి దేశానికి పంపలేము. దీంతో వారు కావాలనే కేసుల్లో ఇన్వాల్వ్​ అవుతున్నట్లు” ఆయన వెల్లడించారు. బంగ్లాదేశ్​(BangladesH)కు చెందిన పౌరులు కూడా శరణార్థులుగా ఇక్కడికి వస్తున్నారని.. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.