ePaper
More
    HomeజాతీయంHimanta Biswa Sarma | ఐఎస్​ఐ శిక్షణ కోసం కాంగ్రెస్​ ఎంపీ పాక్​ వెళ్లాడు.. అస్సాం...

    Himanta Biswa Sarma | ఐఎస్​ఐ శిక్షణ కోసం కాంగ్రెస్​ ఎంపీ పాక్​ వెళ్లాడు.. అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Himanta Biswa Sarma | కాంగ్రెస్​ ఎంపీ గౌరవ్​ గొగోయ్​(Congress MP Gaurav Gogoi)పై అస్సాం సీఎం హిమంత​ బిస్వా శర్మ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్‌కు వెళ్లింది పర్యాటకం కోసం కాదు, ఐఎస్ఐ శిక్షణ(ISI training) కోసమేనని ముఖ్యమంత్రి ఆయన ఆరోపించారు. కాగా దీనిపై గొగోయ్ వ్యంగ్యంగా స్పందిస్తూ, ఇప్పుడు తాను ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నాని అన్నారు.

    దీనికి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) స్పందిస్తూ.. సెప్టెంబర్ 10 వరకు వేచి ఉండండి అని ఎక్స్​ వేదికిగా పోస్ట్​ పెట్టాడు. గొగోయ్ భార్య ఎలిజబెత్​ కోల్​బర్న్​ ఐబీ పత్రాలను యాక్సెస్ చేసి పాకిస్తాన్‌(Pakistan)తో పంచుకుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని సెప్టెంబర్ 10 నాటికి నివేదికను బహిరంగపరుస్తామని వెల్లడించారు.

    Himanta Biswa Sarma | వివాదం ఏమిటంటే..

    అస్సా మాజీ ముఖ్యమంత్రి కుమారుడు గౌరవ్ గొగొయ్​ కాంగ్రెస్​ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన యూకేకు చెందిన ఎలిజబెత్ కోల్‌బర్న్​(Elizabeth Colburn)ను వివాహం చేసుకున్నాడు. ఆమె ఐఎస్​ఐ ఏజెంట్​ అని అస్సాం సీఎం ఆరోపిస్తున్నారు. కాగా 2011 మార్చి నుంచి 2015 2015 మధ్య క్లైమేట్ అండ్ డెవలప్‌మెంట్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (CDKN)తో కలిసి ఆమె పనిచేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్​లో కూడా అధ్యయనం చేశారు. ఆ సంస్థతో ఆమె ఇప్పటికీ సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ క్రమంలోనే హిమంత బిస్వా శర్మ ఆరోపణలు చేశారు. దీనిపై దర్యాప్తు కూడా జరిపిస్తున్నారు.

    More like this

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...