Gaddar Film Awards
Gaddar Film Awards | రేవంత్ రెడ్డితో అల్లు అర్జున్ వేదిక పంచుకుంటారా.. సోష‌ల్ మీడియాలో హాట్ డిస్క‌ష‌న్ ఇదే..!

Gaddar Film Awards | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun వ‌రుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. సినిమా సినిమాకి స‌క్సెస్ రేటు పెంచుకుంటూ దూసుకు వెళ్తున్నాడు.

పుష్ప‌తో నేష‌న‌ల్ అవార్డ్(National Award) అందుకున్న బ‌న్నీ ఇప్పుడు పుష్ప 2తో అంత‌కు మించిన అవార్డ్ అందుకుంటాడ‌ని ఫ్యాన్స్ భావించారు. అయితే ఇప్పుడు పుష్ప 2: ది రూల్ గాను బ‌న్నీ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. తనకు గద్దర్ అవార్డు(Gaddar Award) రావడం ప‌ట్ల సంతోషం వ్యక్తం చేశారు. “ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Gaddar Film Awards | ఒకే వేదిక పంచుకుంటారా?

ఈ అవార్డు దక్కడం వెనుక చిత్ర బృందం కృషి ఎంతో ఉందని అల్లు అర్జున్ అన్నారు. “ఈ క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్, నిర్మాతలకు, మొత్తం పుష్ప బృందానికి చెందుతుంది” అని ఆయన వివరించారు. సినిమా విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరినీ ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.అభిమానుల‌కి ఈ అవార్డ్ అంకిత‌మిస్తాన‌ని అన్నారు.

అయితే జూన్‌ 14న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. గద్దర్ ఫిల్మ్ అవార్డుల Gaddar Film Awards ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకకు బెస్ట్ యాక్టర్‌గా నిలిచిన అల్లు అర్జున్ హాజరైతే.. వారిద్దరు ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు అందుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. సంధ్య థియేటర్‌ ఘటన త‌ర్వాత‌ అల్లు అర్జున్‌పై రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహారించిన‌ట్టు కొంద‌రు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పుష్ప 2(Pushpa 2) సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌ను Allu Arjun జ్యూరీ ఎంపిక చేసిందని, ఇది రేవంత్ రెడ్డికి ఎలాంటి పర్సనల్ అజెండా లేదని స్పష్టం చేస్తుందని కాంగ్రెస్ మద్దతుదారులు పేర్కొంటున్నారు.

కాగా, పుష్ప సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్‌(Allu Arjun) మర్చిపోవ‌డంతో రేవంత్ కక్షపూరితంగా అరెస్ట్ చేయించారనే కొందరు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సైతం అల్లు అర్జున్ తీరును సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. అల్లు అర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించాడని మండిప‌డ్డారు. ఈ ప‌రిణామాల త‌ర్వాత రేవంత్, బ‌న్నీ ఇద్ద‌రు ఒకే వేదిక మీద‌కు వ‌స్తే పుకార్ల‌న్నింటికి చెక్ ప‌డ‌డం ఖాయం.