DGP Jitender
DGP Jitender | కామారెడ్డికి రాష్ట్ర డీజీపీ జితేందర్​ రాక..

అక్షరటుడే, కామారెడ్డి: DGP Jitender | రాష్ట్ర డీజీపీ జితేందర్ గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని (Kamareddy SP office) పరిశీలించారు.

జిల్లా పర్యటనకు డీజీపీకి ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కార్యాలయ ఆవరణలో డీజీపీ మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి పలు విషయాలపై చర్చించారు. వివిధ కేసుల విషయాలు, భద్రత అంశాలపై అధికారులతో సమీక్షిస్తున్నారు. డీజీపీ వెంట మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి(Multi Zone-1 IG Chandrasekhar Reddy) ఉన్నారు. అంతకు ముందు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య డీజీపీని మర్యాదపూర్వకంగా కలిశారు.