- Advertisement -
HomeUncategorizedKunjam Hidma | మావోయిస్టు కీలక నేత కుంజమ్​ హిడ్మా అరెస్ట్​

Kunjam Hidma | మావోయిస్టు కీలక నేత కుంజమ్​ హిడ్మా అరెస్ట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Kunjam Hidma | మావోయిస్టులకు భారీదెబ్బ తగిలింది. పార్టీలోని కీలక మావోయిస్టు నేత కుంజమ్​ హిడ్మాను పోలీసులు అరెస్ట్​(Police Arrest) చేశారు.

ఒడిశాలోని కోరాపుట్​లో గురువారం హిడ్మాను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. హిడ్మా ఛత్తీస్​ఘడ్ (Hidma Chhattisgarh)​ రాష్ట్రంలోని బీజాపూర్​కు చెందిన వ్యక్తి. అతడి నుంచి ఏకే‌‌47తో సహా పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనేక మంది జవాన్లు, రాజకీయ నాయకుల హత్యల్లో హిడ్మా(Hidma) కీలకంగా పనిచేశాడు. మూడు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీ(Maoist Party)లో అంచెలంచెలుగా ఎదిగాడు. వందల మంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకంచేసి దాడి చేయడం అతడి ప్రత్యేకత. దశాబ్దాలుగా ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే మూల కారకుడని పోలీసులు చెబుతారు.

- Advertisement -

కాగా.. రాబోయే రెండేళ్లలో మావోయిస్టులు లేకుండా చేయడమే లేకుండా కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇటీవల పెద్దఎత్తున సర్చ్ నిర్వహించింది. ఇందులో భాగంగా జరిగిన ఎన్కౌంటర్ లో భారీగా నక్సల్స్ హతమయ్యారు. ఇప్పటికీ.. కేంద్ర ప్రత్యేక బలగాలు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో హిడ్మా పట్టుబడటం మావోలకు పెద్ద ఎదురుదెబ్బ.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News