Kerala Crime Files
Kerala Crime Files | స‌రికొత్త క్రైమ్ క‌థాంశంతో 'కేరళ క్రైమ్ ఫైల్స్' సిరీస్ సీజన్ 2 .. ఆసక్తిరేపుతున్న‌ ట్రైలర్

అక్షర టుడే, వెబ్ డెస్క్:Kerala Crime Files | 2023లో ఓటీటీలో విడుద‌లై ప్రేక్ష‌కుల‌కి మంచి థ్రిల్ అందించిన వెబ్ సిరీస్ కేర‌ళ క్రైమ్ ఫైల్స్ Kerala Crime Files . డిస్నీ + హాట్ స్టార్ (జియో హాట్ స్టార్) ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అయిన ఈ వెబ్ సిరీస్‌(Web Series)కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు మ‌రో సీజ‌న్‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ సారి సరికొత్త క్రైమ్ కథాంశంతో కేరళ క్రైమ్ పైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు సీజన్ 2 రాబోతుంది. అయితే తాజాగా.. ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ఆస‌క్తి రేపుతుంది. తిరువనంతపురం జిల్లాలో ఐదుగురు ఎస్‌హెచ్‌వోలు, వేర్వేరు స్టేషన్లలో 12 సివిల్ పోలీసులు ఈ రోజు సస్పెన్షన్‌కు గురయ్యారు అంటూ ట్రైలర్ ప్రారంభం కావ‌డంతో అంచ‌నాలు పెరిగాయి.

Kerala Crime Files | అదిరిపోయింది..

మర్డర్ మిస్టరీ (Murder Mystery) వెనుక ఎవరున్నారో అని క‌నిపెట్ట‌డం ఇందులో చూపించారు. పోలీసులు సస్పెండ్ ఎందుకు అయ్యారు?, వారు ఎవరి కోసం వెతుకుతున్నారు?, చివరకు నిందితులు దొరికారా? అనేది తెలియాలంటే సిరీస్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ‘క్రిమినల్స్(Criminals) మంచిగా ప్రవర్తించాలని మనం అస్సలు అనుకోకూడదు అని ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. ట్రైల‌ర్ మాత్రం చాలా ఆస‌క్తిని రేకెత్తించింది. మలయాళం, తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, బెంగాళీ, మరాఠీ భాషల్లో ఈ సిరీస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇది కూడా మంచి హిట్ అవుతుంద‌ని ట్రైల‌ర్(Trailer) చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

ఈ సిరీస్‌లో అజు వర్గీస్, జిన్జ్ షాన్, లాల్, శ్రీజిత్ మహాదేవన్, నివాస్ వాలిక్కున్ను కీలక పాత్రలు పోషించారు. అహ్మద్ కబీర్ దర్శకత్వం(Directer Ahmed Kabir) వహించారు. ‘కొత్త ఫైల్ ఓపెన్ అయింది. టీం తిరిగి వచ్చింది.’ అంటూ జియో హాట్ స్టార్(Jio Hotstar) సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ రిలీజ్ చేసింది. సీజన్ 1 స్టోరీ ఏంటనేది చూస్తే.. నగరంలోని ఓ లాడ్జిలో నీటి సమస్య తలెత్తగా రిసెప్షనిస్ట్‌గా ఉన్న శరత్ (ఎఆర్ హరిశంకర్).. ఏదైనా రూంలో లీకేజీ ఉందేమోనని చెక్ చేస్తాడు. ఇదే సమయంలో ఓ రూంలో మహిళ డెడ్ బాడీని చూసి షాక్ అవుతాడు. హత్యకు గురైన మహిళ ఓ వేశ్య అని తెలుసుకున్న పోలీసులు Police.. నిందితుడిని ఎలా పట్టుకున్నారు? అనేదే ఈ సిరీస్‌లో చూపించారు.