ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRajiv Yuva Vikasam | ‘రాజీవ్‌ యువవికాసం’కు సిబిల్‌ తిప్పలు.

    Rajiv Yuva Vikasam | ‘రాజీవ్‌ యువవికాసం’కు సిబిల్‌ తిప్పలు.

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Rajiv Yuva Vikasam | యువతకు సబ్సిడీపై (subsidi) రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువవికాసం పథకానికి సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) అడ్డంకిగా మారుతోంది. బ్యాంకులు సైతం లబ్ధిదారుల స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీంతో చాలామంది పథకానికి దూరం కానున్నారు. ప్రభుత్వం ఓవైపు సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) ప్రాతిపదిక కాదని చెబుతున్నా.. బ్యాంకర్లు మాత్రం దాని ఆధారంగానే రుణాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

    రాజీవ్‌ యువ వికాస్‌ పథకం (Rajiv Yuva Vikas scheme) కింద ప్రభుత్వం రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు అందించనుంది. జిల్లాకు 13.450 యూనిట్లు మాత్రమే కేటాయించింది. మొత్తం 44,739 మంది దరఖాస్తు చేసుకున్నారు. రుణాల మంజూరులో సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. గతంలో బ్యాంకులు, ప్రైవేట్‌ ఫైనాన్స్‌ల్లో తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోతే సిబిల్ స్కోర్‌ cibil score పడిపోతుంది. కానీ, ఎంతోమంది వివిధ కారణాలతో రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారికి సిబిల్‌ స్కోర్‌ ఉండదు. ఈ పథకానికి వీరంతా అనర్హులు కానుండడంతో, ఆందోళన మొదలైంది. దీంతోపాటు ఇదివరకే ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు పొందినవారు కూడా అనర్హులు కానున్నారు.

    Rajiv Yuva Vikasam | మొదటి విడతలో రూ.50 వేలకే..

    రాజీవ్‌ యువ వికాస్‌ కింద ప్రభుత్వం(Government) మొదటగా రూ.50 వేల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే మంజూరు కానుంది. జిల్లాలో 1127 మంది ఈ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులను ఎంపిక చేయనున్నారు. మిగిలినవారికి విడతలవారీగా రుణాలు అందించనున్నారు.

    Rajiv Yuva Vikasam | పైరవీల కోసం ప్రదక్షిణలు..

    జిల్లాలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తమకు రుణం మంజూరవుతుందో, లేదోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే తమకు తెలిసిన నాయకుల ద్వారా పైరవీలు ప్రారంభించారు. ఎలాగైనా రుణం ఇప్పించాలని నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు చోట మోటా నాయకులు పైరవీలు చేస్తూ.. కమీషన్‌ కూడా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ప్రక్రియ కొనసాగుతోంది..

    – సురేందర్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్

    జిల్లాలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 44,739 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం 13,450 యూనిట్లు మంజూరు చేసింది. మొదటి విడతలో 1,127 మందికి రూ.50వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తాం. బ్యాంకర్లు సిబిల్ స్కోర్ అడుగుతున్నారని తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణాలు మంజూరవుతాయి.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 7 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 7 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...