ePaper
More
    Homeటెక్నాలజీJio Hotstar | జియో హాట్​స్టార్​ రికార్డ్​.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఓటీటీ

    Jio Hotstar | జియో హాట్​స్టార్​ రికార్డ్​.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఓటీటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jio Hotstar | జియో హాట్​స్టార్​ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక సబ్​స్క్రైబర్లు కలిగిన జాబితాలో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం నెట్​ఫ్లిక్స్ (Netflix)​ అగ్రస్థానంలో కొనసాగుతోంది. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం అయి జియో హాట్​స్టార్​గా మారిన విషయం తెలిసిందే. 2025 ఫిబ్రవరి 14న జియో హాట్​స్టార్​ ప్రారంభమైంది. ఆ సమయంలో 50 మిలియన్ల సబ్​స్క్రైబర్లు ఉండగా.. తాజాగా 280 మిలియన్లకు చేరడం గమనార్హం.

    Jio Hotstar | అగ్రస్థానంలో నెట్​ఫ్లిక్స్​

    అమెరికాకు చెందిన ఓటీటీ ప్లాట్​ఫాం నెట్​ఫ్లిక్స్​ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక యూజర్లను కలిగి ఉంది. ఈ ఓటీటీకి 300 మిలియన్ల సబ్​స్క్రైబర్లు(300 million subscribers) ఉన్నారు. జియో హాట్​స్టార్​ 280 మిలియన్ల వినియోగదారులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో మరికొద్ది రోజుల్లో జియో హాట్​స్టార్​ అగ్రస్థానంలోకి చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

    Jio Hotstar | ఐపీఎల్​తో పెరిగిన యూజర్లు

    భారత్​లో ఐపీఎల్​(IPL)కు ఉండే క్రేజ్​ అంతా ఇంతా కాదు. భారత్​తో పాటు విదేశాల్లో సైతం ఐపీఎల్​ మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో జియో హాట్​స్టార్​ ఐపీఎల్​ ఓటీటీ రైట్స్​ దక్కించుకుంది. అంతేగాకుండా ICC ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఐసీసీ ఛాంపియన్స్​ ట్రోఫీ(ICC Champions Trophy), ఐపీఎల్​ హక్కులు దక్కించుకోవడంతో జియో హాట్​స్టార్​ బాగా కలిసి వచ్చింది. క్రికెట్​ ప్రేమికులు సబ్​స్క్రిప్షన్​ తీసుకోవడంతో ఈ ఓటీటీ ప్లాట్​ఫామ్​ యూజర్లు ఒక్కసారిగా భారీగా పెరిగారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా-న్యూజిలాండ్ ఫైనల్‌ మ్యాచ్​ను ఏకకాలంలో 61 మిలియన్ల మంది వీక్షించారంటే అర్థం చేసుకోవచ్చు.

    Jio Hotstar | కంటెంట్​లోనూ రారాజు..

    జియో హాట్​స్టార్ మొత్తం 320,000 గంటల కంటెంట్‌ను కలిగి ఉంది. ఇందులో డిస్నీ, హెచ్​బీవో, వార్నర్ బ్రదర్స్, NBC Universal, Peacock మరియు Paramount వంటి గ్లోబల్ స్టూడియోల నుంచి 250 ఒరిజినల్ ప్రోగ్రామ్స్​ ఉన్నాయి. మరియు తక్కువ ధరకు సబ్​స్క్రిప్షన్​ అందిస్తోంది. మొబైల్​ యూజర్లకు రూ.149కే మూడు నెలల సబ్​స్క్రిప్షన్​ అందిస్తోంది. తక్కువ ధరకు సబ్​స్క్రిప్షన్​ లభించడం కూడా యూజర్లు పెరగడానికి ఒక కారణం.

    Jio Hotstar | మూడో స్థానంలో అమెజాన్​ ప్రైమ్​

    ప్రపంచ వ్యాప్తంగా 300 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో నెట్​ఫ్లిక్స్ (Netflix)​ అగ్రస్థానంలో ఉండగా, 280 మిలియన్లతో జియో హాట్​స్టార్ (Jio Hotstar)​ సెకండ్​ ప్లేస్​లో ఉంది. అమెజాన్ ప్రైమ్​ 200 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇండియాయాలో నెట్‌ఫ్లిక్స్ 15 మిలియన్ల మంది ప్రైమ్ వీడియోకు 25 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం.

    More like this

    Madhya Pradesh | పీసీసీ అధ్య‌క్షుడి ఇంట్లో దొంగ‌ల భీబ‌త్సం.. ఆ అధికారుల ఇండ్లను లక్ష్యంగా చేసుకున్న ముఠా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Madhya Pradesh | మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీతూ పట్వారీ (Jitu Patwari) ఇంట్లో శనివారం...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ మాత్రమే...

    Helicopter to exam center | హెలికాప్టర్​లో ఎగ్జామ్ సెంటర్​కు స్టూడెంట్స్.. అద్దెకు తీసుకుని మరీ..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helicopter to exam center : ఇటీవల ఓ విద్యార్థిని తాను చదివే విద్యాసంస్థకు గుర్రంపై...