ePaper
More
    Homeక్రైంUttar Pradesh | ఎన్​కౌంటర్​లో బిష్ణోయ్​ గ్యాంగ్​ షూటర్​ మృతి

    Uttar Pradesh | ఎన్​కౌంటర్​లో బిష్ణోయ్​ గ్యాంగ్​ షూటర్​ మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | లారెన్స్​ బిష్ణోయ్​ గ్యాంగ్​ (Lawrence Bishnoi Gang)కు చెందిన షార్ప్​ షూటర్​ ఎన్​కౌంటర్(Encounter)​లో మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఈ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది.

    బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో షార్ప్‌ షూటర్‌గా పేరొందిన నవీన్‌కుమార్‌ (20)కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నవీన్​ ఘజియాబాద్‌ జిల్లాకు చెందినవాడు. బిష్ణోయ్​ గ్యాంగ్​లో షార్ప్‌ షూటర్‌గా ఎదిగాడు. అతడిపై ఢిల్లీ, యూపీలలో హత్యా, హత్యాయత్నం, కిడ్నాప్‌, దోపిడీ కేసులు నమోదు అయ్యాయి.

    అయితే నవీన్​కుమార్​ కోసం హాపుర్‌లో ఉత్తరప్రదేశ్‌ టాస్క్‌ఫోర్స్(UP Task Force), ఢిల్లీ పోలీసులు (Delhi Police) జాయింట్​ ఆపరేషన్‌ నిర్వహించారు. పోలీసులను చూసి అతగు వారిపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నవీన్​ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

    Uttar Pradesh | సల్మాన్​ ఖాన్​కు బెదిరింపులు

    బిష్ణోయ్​ గ్యాంగ్​ అధినేత లారెన్స్​ బిష్ణోయ్​ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయినా.. తన అనుచరులతో బయట పనులు చేయిస్తుండటం గమనార్హం. ఈ గ్యాంగ్​ ఇటీవల పలుమార్లు బాలీవుడు హీరో సల్మాన్​ ఖాన్(Salman Khan)​ను చంపునతామని బెదిరించింది. అంతేగాకుండా సల్మాన్​ ఖాన్​స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ(Baba Siddikhi)ని హత్య చేసింది. అప్పటి నుంచి ఈ గ్యాంగ్​ పేరు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జైలులో ఉన్న లారెన్స్​ బిష్ణోయ్​ తన అనుచరుల ద్వారా హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

    Latest articles

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...

    CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy)...

    YS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్​.. ఏపీలో అరాచక పాలన : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్

    అక్షరటుడే, అమరావతి : YS Jagan | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ...

    More like this