- Advertisement -
HomeతెలంగాణAnganwadi | అంగన్‌వాడీ ఉద్యోగులకు శుభవార్త!

Anganwadi | అంగన్‌వాడీ ఉద్యోగులకు శుభవార్త!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anganwadi | అంగన్​వాడీ ఉద్యోగుల(Anganwadi Employees)కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది.

వారికి ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ (Retirement Benifits)​ పెంచడానికి ప్రభుత్వం ఒకే చెప్పింది. గతంలో అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లకు ఉద్యోగ విమరణ ఉండేది కాదు. చాలా మంది జీవిత కాలం పని చేసేవారు. అయితే ఏడాది క్రితం ప్రభుత్వం అంగన్​వాడీ టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విమరణ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

కాగా.. రిటైర్మెంట్​ వయసును 65 ఏళ్లుగా పేర్కొంది. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్​ కింద అంగన్​వాడీ టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ మొత్తాన్ని పెంచాలని అంగన్​వాడీ ఉద్యోగులు కొంతకాలంగా డిమాండ్​ చేస్తున్నారు.

Anganwadi | రూ.2 లక్షలకు పెంచిన ప్రభుత్వం

అంగన్​వాడీ ఉద్యోగుల డిమాండ్​ మేరకు ప్రభుత్వం తాజాగా రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంగన్​వాడీ టీచర్లకు(Anganwadi Teachers) రూ.రెండు లక్షలు, ఆయాలకు (Anganwadi Helpres) రూ.లక్ష చొప్పున ఇక నుంచి ఇస్తామని తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జూన్​ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్​వాడీ టీచర్లను అప్​గ్రేడ్​ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 3,989 టీచర్లు ఉండేవారు. వీరికి రూ.7,800 వేతనం వచ్చేది. అయితే వీరిని అంగన్​వాడీ టీచర్లుగానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి రాష్ట్రంలో మినీ అంగన్​వాడీలు ఉండవని తెలిపింది. దీంతో వారికి రూ.13,560 వేతనం అందనుంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News