ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | తెలంగాణలో కీలక పరిణామం.. మంత్రులకు సీఎం దావత్..​ ఇది అందుకోసమేనా..?

    CM Revanth Reddy | తెలంగాణలో కీలక పరిణామం.. మంత్రులకు సీఎం దావత్..​ ఇది అందుకోసమేనా..?

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్:CM Revanth Reddy | ఇదిగో అదిగో కేబినెట్‌ విస్తరణ..! అంటూ గత కొన్ని నెలలుగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది.

    సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్‌ విస్తరణ తెరపైకి వస్తోంది. ఇటీవలే ఇక ఫైనల్​కు వచ్చిందని ప్రచారం జరిగింది. పార్టీ​ అగ్రనేత రాహుల్​గాంధీ (Rahul Gandhi) ఒకే అనగానే ప్రకటిస్తారని అన్నారు. కానీ, మళ్లీ వాయిదా పడటంతో ఆశావహులు ఉసూరుమన్నారు. ఇలాంటి తరుణంలో ఆసక్తికర మరిణామం చోటుచేసుకుంది.

    CM Revanth Reddy | మంత్రులకు స్పెషల్ విందు ఎందుకు!

    మంత్రులందరికీ బంజారాహిల్స్ (Banjara Hills) లోని తన ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రైవేటు డిన్నర్ పార్టీ అరెంజ్​ చేశారు. దీంతో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్చలీ చర్చకు వచ్చింది. సీఎం పిలుపుతో దాదాపుగా మంత్రివర్గం (Ministerial Council) మొత్తం సీఎం ఇంటికి చేరిపోయింది. ముఖ్యమంత్రి ఇచ్చిన డిన్నర్​ను ఆరగించింది! ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పటికిప్పుడు ఈ డిన్నర్‌ ఎందుకనేదానిపై చర్చ నడుస్తోంది.

    విందు పేరుతో మంత్రులు ఏం చర్చించుకున్నారు..? ముఖ్యమంత్రి వాళ్లకు ఏం చెప్పారు? అనేది ఆసక్తికరంగా మారింది. కేబినెట్‌ బెర్త్‌(Cabinet Berth) కోసం ఎదురుచూస్తున్న నేతల్లో ఉత్కంఠకు కారణం అయింది. విస్తరణకు ముందు ముఖ్యమంత్రి ఆనవాయితీగా ఇచ్చే డిన్నర్‌ అంటూ ప్రచారం జరుగుతోంది.

    CM Revanth Reddy | రంగంలోకి మీనాక్షి నటరాజన్

    కాగా.. మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాది కాలంగా పెండింగులో ఉంది. సామాజిక సమీకరణాల కారణంతో అధిష్టానం వాయిదా వేస్తూ వస్తోంది. దీంతో గతంతో పోలిస్తే.. ప్రస్తుతం ఆశావహులు మూడింతలు పెరిగారు. ప్రత్యేకించి ఎమ్మెల్యేలు తమ తమ సామాజిక వర్గాలుగా విడిపోయారు. రహస్యంగా భేటీ అయ్యి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీకి జలక్ ఇస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. అన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరి అందరినీ బుజ్జగించి.. ఈ సారైనా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తారా..? లేక ఎప్పటిలాగే మళ్లీ చూద్దామని వదిలేస్తారా..? అనేది త్వరలోనే స్పష్టత రానుంది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...