ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Parents | అమ్మానాన్న పట్టించుకోవడం లేదు.. ఠాణాలో ఓ బాలిక ఫిర్యాదు

    Parents | అమ్మానాన్న పట్టించుకోవడం లేదు.. ఠాణాలో ఓ బాలిక ఫిర్యాదు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Parents : ఆడుతూ పాడుతూ సరదాగా గడిపే వయసులో ఆ బాలిక పోలీస్ స్టేషన్ police station మెట్లెక్కింది. తోటి వారందరూ వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటే.. తను మాత్రం అమ్మ అనురాగం, నాన్న ప్రేమ కోసం ఖాకీల పంచన చేరింది.

    కన్నపేగును వదిలేసుకున్న తల్లిదండ్రుల కోసం కన్నీరు కారుస్తోంది. అమ్మానాన్నలే తనను వద్దంటే నా బతుకేంకానంటూ ఆ ఎనిమిదో తరగతి విద్యార్థిని 8th class student కన్నీరుమున్నీరవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు..

    విశాఖపట్నాని(Visakhapatnam)కి చెందిన వ్యక్తికి, అనకాపల్లి(Anakapalle)కి చెందిన మహిళకు పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి తండ్రి దగ్గర ఉంటోంది.

    కాగా, తల్లిదండ్రులు తనను పట్టించుకోవడం లేదంటూ బాలిక పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లిదండ్రులను పిలిపించారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయితే, కుమార్తెను తమతో తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇష్టపడకపోవడంతో పోలీసులు విస్తుపోయారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో చివరికి బాలిక బాధ్యతను ఆమె తాతకు అప్పగించారు పోలీసులు.

    More like this

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....