ePaper
More
    HomeతెలంగాణRajiv Yuva Vikasam | గుడ్‌న్యూస్‌.. ఆ రోజే రాజీవ్ యువ వికాసం మంజూరు ప‌త్రాలు

    Rajiv Yuva Vikasam | గుడ్‌న్యూస్‌.. ఆ రోజే రాజీవ్ యువ వికాసం మంజూరు ప‌త్రాలు

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు గుడ్ న్యూస్. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సంద‌ర్భంగా మంజూరు పత్రాలు అందజేస్తామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలియజేశారు.

    ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ.. జూన్‌లో రూ.50 వేలు, లక్ష సబ్సిడీ రుణ కేటగిరీలోని లబ్ధిదారులకు మొదటగా మంజూరు చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు.

    Rajiv Yuva Vikasam | ఎంపికైన ల‌బ్ధిదారుల‌కు శిక్ష‌ణ‌..

    ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు యూనిట్ల స్థాపన, నిర్వహణ, మార్కెటింగ్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. జూన్ 16 నుండి 20వ తేదీ వరకు సబ్సిడీ మొత్తాలను విడుదల చేస్తారని, 21 నుంచి 30వ తేదీ వరకు యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. జూలైలో లక్ష నుంచి రెండు లక్షల కేటగిరీకి చెందిన వారికి అందజేస్తామని స్ప‌ష్టం చేశారు.

    Rajiv Yuva Vikasam | త‌ప్ప‌నిస‌రిగా యూనిట్లు స్థాపించాలి..

    ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రెండు నుంచి నాలుగు లక్షల కేటగిరీకి చెందిన వారికి మంజూరు ప‌త్రాలు ఇస్తామ‌ని వివ‌రించారు. లబ్ధిదారులు తప్పనిసరిగా యూనిట్లను స్థాపించుకొని ఆర్థిక పురోగతి సాధించేలా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. యూనిట్ల మానిట‌రింగ్ కోసం ఈనెల 29,30 తేదీల్లో స‌మావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu), అదనపు కలెక్టర్ అంకిత్, లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగురావ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...