అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IIIT Admissions | ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నిర్మల్(Nirmal) జిల్లా బాసరలో ఉన్న రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RGKUT)లో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన వారికి అవకాశం కల్పిస్తారు. ఇందులో ఎంపికైతే ఆరేళ్ల పాటు ట్రిపుల్ ఐటీలో ఉచితంగా చదువుకోవచ్చు. ప్రవేశాల కోసం బుధవారం నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
IIIT Admissions | కొత్తగా మరో ట్రిపుల్ ఐటీ మంజూరు
రాష్ట్రంలో ప్రస్తుతం బాసరలో ట్రిపుట్(Basara IIIT) ఐటీ ఉంది. ఇందులో 1,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రభుత్వం తాజాగా మరో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహబూబ్‌నగర్(Mahabubnagar)లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ క్యాంపస్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభించనుంది. ఇందులో ప్రస్తుతం 180 సీట్లను భర్తీ చేయనున్నారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలో మొత్తం ట్రిపుల్ ఐటీలో 1680 సీట్లను భర్తీ చేయనున్నారు.
IIIT Admissions | దరఖాస్తు ప్రక్రియ ఇలా..
ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి జూన్ 21 వరకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేక క్యాటగిరి (పీహెచ్, ఎన్సీసీస, స్పోర్ట్స్) అభ్యర్థులు మాత్రం జూన్ 25లోపు దరఖాస్తు పత్రాల కాపీలు, సంబంధిత సర్టిఫికెట్లు బాసర ట్రిపుల్ ఐటీకి పోస్ట్‌లో పంపాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు జూలై 4న వెల్లడిస్తారు. జూలై 7 నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతోంది.
IIIT Admissions | మెరిట్ ఆధారంగా ఎంపిక
ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రవేశ షెడ్యూల్‌తో పాటు ఇతర వివరాలను బాసర యూనివర్సిటీ వీసీ గోవర్ధన్ basara IIIT VC goverdhan తెలిపారు. బాసర క్యాంపస్లో 1,500 సీట్లు, మహబూబ్ నగర్ కొత్త క్యాంపస్లో 180 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. అది కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. మహబూబ్‌నగర్ క్యాంపస్లో ఈ ఏడాది మూడు కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. CSE, AI & ML, డేటా సైన్స్ కోర్సులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ వివరాల కోసం https://www.rgukt.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.