అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా మహాసభలు జూన్ 1న నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి సుధాకర్ (General Secretary Sudhakar) తెలిపారు. బుధవారం నగరంలోని కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎన్ఆర్ భవన్లో ఉంటుందన్నారు. జిల్లాలోని మున్సిపల్, గ్రామపంచాయతీ (gram panchayat), కేజీబీవీ, మోడల్ స్కూల్, భవన నిర్మాణ రంగం, మిషన్ భగీరథ, హమాలీ, మోటార్ రంగ కార్మికులు, బీడీ కార్మికుల కోసం రాజీలేని పోరాటం చేశామన్నారు. వారంతా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీయుసీఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, రాజేశ్వర్, సహాయ కార్యదర్శి మల్లేష్, కిరణ్, సాయన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.