అక్షరటుడే, ఇందూరు: Muncipal Corporation | నగరపాలక సంస్థలో పనిచేసే సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే విధులు సక్రమంగా చేయగలుగుతారని కమిషనర్ దిలీప్‌కుమార్ (Commissioner Dilip Kumar) అన్నారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association) సహకారంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ భవన్లో (Ambedkar Bhavan) ఆరోగ్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ (Municipal Corporation) కార్యాలయ సిబ్బంది, ప్రజారోగ్య కార్యకర్తలు, డ్రైవర్లు, జవాన్లకు వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో అన్ని విభాగాల వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.