More
    Homeభక్తిHoroscope | జ్యేష్టం.. బ్రహ్మకు ప్రీతికరమైన మాసం

    Horoscope | జ్యేష్టం.. బ్రహ్మకు ప్రీతికరమైన మాసం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Horoscope | తెలుగు మాసాలలో చైత్రం, వైశాఖం తర్వాత వచ్చే మూడో మాసం జ్యేష్ట మాసం(Jyeshta Masam). ఇది బ్రహ్మ(Brahma) దేవుడికి ప్రీతికరమైన మాసమని భావిస్తారు. బ్రహ్మ కు ప్రీతికరమైన మాసం కావడంతో ఆయన అనుగ్రహం కోసం గోధుమ పిండితో బ్రహ్మదేవుడి ప్రతిమను తయారు చేసుకుని పూజించాలని ఆధ్యాత్మిక వేత్త రుద్రమణి శివాచార్య సూచిస్తున్నారు. ఈ నెలలో సూర్య, వరుణ దేవులను ఆరాదించడం, విష్ణుసహస్ర నామ పారాయణం(Vishnu Sahasranama parayanam), జలదానం చేయడం విశేష ఫలితాలను ఇస్తాయని పేర్కొంటున్నారు.

    సాధారణంగా జ్యేష్ట మాసారంభంలో సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఈ మాసంలో పగలు సమయం ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ భానుడి ప్రతాపం తగ్గుతుంటుంది. ఈ మాసంలో జల దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఇది ఎండాకాలంలో వచ్చే మాసం కావడంతో జలదానం చేస్తే ప్రజల దాహార్తి తీరి, పుణ్యం లభిస్తుందన్నది వారి ఉద్దేశం. అలాగే నీటిని సంరక్షించాలని సూచిస్తారు. గ్రీష్మ ఋతువులో వచ్చే జ్యేష్ట మాసంలో ఎన్నో పండుగలు, పుణ్య తిథులు ఉన్నాయి. ఈ మాసంలో ప్రత్యేకమైన తిథుల వివరాలు..

    మే 28 : జ్యేష్ట మాసం ప్రారంభం
    జూన్ 6 : జ్యేష్ట శుద్ధ ఏకాదశి, నిర్జల ఏకాదశి
    జూన్ 8 : మృగశిర కార్తె ప్రారంభం
    జూన్ 9 : జ్యేష్ట శుద్ధ త్రయోదశి, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ పట్టాభిషిక్తుడైన రోజు
    జూన్ 10 : గురుమూఢమి ప్రారంభం
    జూన్ 11 : ఏరువాక పున్నమి.
    జూన్ 14 : సంకష్ట హర చతుర్థి
    జూన్ 22 : ఆరుద్ర కార్తె ప్రారంభం
    జూన్ 24 : మాసశివరాత్రి
    జూన్ 25 : గాండ్ల అమావాస్య, జ్యేష్ట మాసం సమాప్తం.

    More like this

    Kamareddy | కబ్జాదారులకు సీఐ అండగా నిలుస్తున్నారని ఎస్సీ కమిషన్​కు ఫిర్యాదు!

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలో ఓ సీఐ తీరు వివాదాస్పదంగా మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు సీఐ...

    TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. డిసెంబర్​ దర్శన కోటా టికెట్ల విడుదల ఎప్పుడంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూసే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన...

    Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా మినీ ట్యాంక్ బండ్‌ను తీర్చిదిద్దాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా నగరంలోని ఖిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్​ను...