అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Traffic Police | కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ (Black film) వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) పేర్కొన్నారు.
సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Traffic Inspector Prasad) ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లను ఆపి ఫిల్మ్ తొలగింపజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోటారు వాహనాల చట్టం, ఆర్టీఏ నిబంధన ప్రకారం కార్ల డోర్లకు ఫిల్మ్ ఉండడం నేరమన్నారు. తనిఖీల్లో ఆర్ఐ వినోద్, ఆర్ఎస్సై సుమన్ పాల్గొని బ్లాక్ ఫిల్మ్ వాడుతున్న కార్లకు జరిమానాలు విధించారు.