ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | శ్రీవారి భ‌క్తురాలి క‌ష్టాలు.. దాచుకున్న న‌గ‌లు మాయం

    Tirumala | శ్రీవారి భ‌క్తురాలి క‌ష్టాలు.. దాచుకున్న న‌గ‌లు మాయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Tirumala | పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలోని Tirumala ఓ వసతి గృహంలో తాజాగా జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

    శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఏర్పాటుచేసిన వసతి గృహాంలో దొంగతనం జ‌రిగింద‌ని పోలీసులు(Police) వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని కూక‌ట్‌ప‌ల్లి నుండి వచ్చిన శ్రీదేవి కుటుంబం విష్ణు నివాసం(Vishnu Niwasam)లోని రూమ్ నెంబర్ 613లో వసతి పొందారు. స్వామి వారి దర్శనానికి వెళ్లి వచ్చి గదిలో నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరిగిందని ఆమె తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఆభరణాలను చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో 16 గ్రాముల బంగారు నగలు (16 grams gold jewelry) దొంగలు ఎత్తుకెళ్లారని హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన శ్రీదేవి తెలిపారు.

    Tirumala | ఎంత దోచుకున్నారు..

    శ్రీదేవి Sridevi ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి వసతి గృహ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌(CCTV footage)ను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటన తిరుమలలో భద్రతా చర్యలపై ప్రశ్నలు కలిగిస్తోంది. తిరుమల వంటి పవిత్ర ప్రదేశంలో భద్రతా లోపాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ(TTD)పై ఉన్నదని కొంద‌రు భ‌క్తులు చెబుతున్నారు. అయితే అక్క‌డ ప‌ని చేసే వారే తీసి ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు.

    కాగా.. 16 గ్రాముల పాత బంగారం అంటే ఇప్ప‌టి ధ‌ర‌ల‌కి రూ. 2 ల‌క్ష‌లు అంత. ఇప్పుడు వేస‌వి సెల‌వులు కావ‌డంతో తిర‌మ‌ల‌లో ర‌ద్దీ బాగా పెరిగింది. టీటీడీ వ‌స‌తి గృహాల్లో క‌నీసం న‌డిచేందుకు కూడా చోటు ఉండ‌డం లేదు. అంతా భ‌క్తులమ‌యం. అయితే రోజురోజుకి భ‌క్తులు(Devotees) పెరుగుతున్నా కూడా టీటీడీ అందుకు త‌గ్గ ఏర్పాట్లు చేస్తుంది. కానీ.. ఇలాంటి చోరీ ఘటనలు వెలుగుచూడడం భక్తులను కలవర పెడుతోంది.

    Latest articles

    Heroine Hansika | హీరోయిన్ విడాకుల రూమ‌ర్స్.. ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయ‌డంతో వచ్చిన క్లారిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heroine Hansika | ఇటీవలి కాలంలో సినీ ప్రపంచంలో విభేదాలతో విడాకులు తీసుకుంటున్న జంటల...

    Free Bus Scheme | ఏపీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై కీల‌క అప్‌డేట్.. ఎవ‌రు అర్హులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(Andhra Pradesh Government) మహిళల కోసం మరో...

    Upasana Kamineni | మెగా కోడ‌లికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. చిరు, రామ్ చ‌ర‌ణ్ ఫుల్ హ్యాపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Upasana Kamineni | మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కు తెలంగాణ...

    Stock Markets | ట్రంప్‌ బెదిరింపులు.. ఒత్తిడిలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లన్నీ పాజిటివ్‌గా ఉన్నా.. ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులతో...

    More like this