ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Pocharam Srinivas Reddy |ఆదర్శప్రాయుడు ఎన్టీ రామారావు: ఎమ్మెల్యే పోచారం

    Mla Pocharam Srinivas Reddy |ఆదర్శప్రాయుడు ఎన్టీ రామారావు: ఎమ్మెల్యే పోచారం

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Mla Pocharam Srinivas Reddy | పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR)​ ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao) జయంతిని ఘనంగా నిర్వహించారు.

    ఎన్టీఆర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. ఎంతోమందికి రాజకీయం నేర్పింది ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. సంక్షేమ పథకాల అమలు ఆయన హయాంలోనే ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ సంఘం అధ్యక్షుడు శ్రీధర్, రమేష్ బాబు, ఉదయ్ భాస్కర్, నాయకులు, విండో ఛైర్మన్ కూచి సిద్దు, మండల అధ్యక్షుడు శంకర్, కొట్టం మనోహర్, ఎజాజ్ ఖాన్, పత్తి లక్ష్మణ్, హఖీమ్, అనిల్, జుబేర్ తదితరులున్నారు.

    Mla Pocharam Srinivas Reddy | బీర్కూరులో..

    అక్షరటుడే, బాన్సువాడ: మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతిని బీర్కూరు (Birkoor Mandal) మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, కమ్మ సత్యనారాయణ, ఓంకార్, సాయిలు, కృష్ణారెడ్డి, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.

    Mla Pocharam Srinivas Reddy | బోధన్​ పట్టణంలోని కమ్మ సంఘంలో..

    అక్షరటుడే, బోధన్:పట్టణంలోని కమ్మ సంఘ భవనంలో బుధవారం నందమూరి తారక రామారావు 102వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం, ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే లెజెండరీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, కమ్మ సంఘం, ఎన్టీఆర్ అభిమాన సంఘ కమిటీ అధ్యక్షుడు శివన్నారాయణ, కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు అడ్లూరి శ్రీనివాస్, దూప్ సింగ్, ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.

    Mla Pocharam Srinivas Reddy | లింగంపేటలో..

    అక్షరటుడే, లింగంపేట: మండల కేంద్రంలో బుధవారం ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ హాస్టల్ ఎదురుగా టీడీపీ జెండాను ఆ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. గాంధీ నగర్​లో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ టీడీపీ నాయకులు కమ్మర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...