ePaper
More
    HomeతెలంగాణCP Sai Chaitanya | కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: సీపీ

    CP Sai Chaitanya | కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: సీపీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ:CP Sai Chaitanya | కొత్త చట్టాలైన బీఎన్​ఎస్(BNS)​, బీఎన్​ఎస్​ఎస్(BNSS)​, బీఎస్​ఏ(BSA)లపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్​లో బుధవారం జర్నలిస్టులకు వర్క్​షాప్​ నిర్వహించారు.

    ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 1860 నాటి బ్రిటీష్​ కాలం చట్టాలను మార్చేసి బీఎన్​ఎస్​, బీఎన్​ఎస్​ఎస్​, బీఎస్​ఏ కొత్త చట్టాలను గత డిసెంబర్​లో అమల్లోకి చెచ్చిందన్నారు. వివాదాస్పద వార్తలు రాసే సమయంలో లీగల్​ ఒపీనియన్​, కన్సల్ట్​ ఆఫీసర్లను సంప్రదించాలని సూచించారు. సంఘటన నిజామా..? కాదా..? అనే విషయాన్ని గమనించాలన్నారు. పోక్సో(POCSO), మైనర్లకు (Minors) సంబంధించిన వార్తల విషయంలో బాధితుల వివరాలు వెల్లడించినట్లయితే కొత్త చట్టం ప్రకారం కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. విలేకరులు నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవడం తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు పాల్గొన్నారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....