అక్షరటుడే, వెబ్‌డెస్క్:Belrise Industries IPO | ఆటోమోటివ్ కాంపోనెంట్స్ తయారు చేసే దేశీయ సంస్థ అయిన బెల్రైజ్(Belrise) ఇండస్ట్రీస్ బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్టయ్యింది.
ఐపీవో ఇన్వెస్టర్లకు తొలిరోజే 11 శాతానికిపైగా లాభాల(Gains)ను ఆర్జించిపెట్టింది. మార్కెట్‌నుంచి రూ. 2,150 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో బెల్రైజ్ కంపెనీ ఐపీవోకు వచ్చింది. ఒక్కో షేరు ధర రూ. 90 గా నిర్ణయించి బిడ్లను ఆహ్వానించింది. రిటైల్ కోటా 4.52 రెట్లు మాత్రమే సబ్‌స్క్రైబ్(Subscribe) అయ్యింది. ఈ కంపెనీ షేర్లు బుధవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యాయి. సుమారు 10 శాతం ప్రీమియంతో రూ. 98.5 వద్ద లిస్టయ్యాయి.
ఇంటాడ్రే(Intraday)లో గరిష్టంగా రూ. 103 వరకు పెరిగిన షేరు ధర ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో రూ. 91.36కు పడిపోయింది. మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో రూ. 98.50 వద్ద ట్రేడ్ అవుతోంది.
Belrise Industries IPO | డార్ క్రెడిట్ అండ్ క్యాపిటల్..
డార్ క్రెడిట్ అండ్ క్యాపిటల్(Dar Credit and Capital) ఎస్ఎంఈ ఐపీవో కూడా బుధవారం ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. ఐపీవో ఇన్వెస్టర్లకు 9 శాతానికిపైగా లాభాన్ని అందించింది. రూ. 25.66 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చిన ఈ కంపెనీకి మంచి స్పందన లభించింది. రిటైల్ కోటా(Retail quota) 105 శాతం ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది.
లిస్టింగ్ రోజు సుమారు 16 శాతం లాభాలు వస్తాయని గ్రే మార్కెట్ ప్రీమియం(Grey market premium) ఆధారంగా అంచనా వేశారు. కానీ 9 శాతం లాభాలతో రూ. 65.15 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ. 61.90 వద్ద స్థిరపడింది.