ePaper
More
    HomeసినిమాTeja Sajja | మిరాయ్ టీజ‌ర్‌తో మ‌తి పోగొట్టిన తేజ స‌జ్జా.. లాస్ట్ షాట్ గూస్...

    Teja Sajja | మిరాయ్ టీజ‌ర్‌తో మ‌తి పోగొట్టిన తేజ స‌జ్జా.. లాస్ట్ షాట్ గూస్ బంప్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Teja Sajja | యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. ‘హనుమాన్’(Hanuman) చిత్రంలో సూపర్ హీరో గా కనిపించిన తేజ సజ్జా ఇప్పుడు మిరాయ్(Mirai) అనే చిత్రంతో మ‌రో కొత్త ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ర‌వితేజ హీరోగా ఈగ‌ల్ మూవీ తెర‌కెక్కించిన కార్తిక్‌ ఘట్టమనేని తెర‌కెక్కిస్తున్నాడు. యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రంగా ‘మిరాయ్‌’ (Mirai,) రూపొందుతుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలైన తేజ సజ్జా, మంచు మనోజ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు, స్పెషల్‌ గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

    Teja Sajja | అద్దిరిపోయింది..

    దేశ‌ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఓ కీల‌క అప్డేట్ ఇచ్చారు. 2 నిమిషాల 23 సెక‌న్ల టీజ‌ర్ ఇది. దాదాపు ట్రైల‌ర్‌లానే అనిపించింది. కంటెంట్ కూడా కావ‌ల్సినంత ఉంది. ఇదో సూప‌ర్ హీరో క‌థ‌. ‘మిరాయ్‌’ అంటే ఓ ఆయుధం. ఆ ఆయుధం హీరో చేతికి ఎలా వ‌చ్చింది? వ‌చ్చాక ఏం చేశాడ‌న్న‌దే ‘మిరాయ్‌’ క‌థ‌. ఈ టీజర్ మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నారని చెప్పవచ్చు. మన ఇండియన్ సినిమా (Indian Cinema) దగ్గర ఎన్నో భారీ సినిమాలు వస్తున్నాయి కానీ కంటెంట్ ఉంటే దానికి తగ్గట్టుగా కావాల్సిన ప్రామిసింగ్ విజువల్స్ మెయిన్ గా ఇవి గ్రాఫిక్స్ అని తెలిసిపోయేవే ఎక్కువ కనిపిస్తున్నాయి.

    మరి వాటికి ఈ మిరాయ్ అతీతంగా ఉందని చెప్పడంలో సందేహమే లేదు. తేజ సజ్జపై సన్నివేశాల్లో ఎక్కడా కూడా మేకర్స్ అసలు కాంప్రమైజ్ అయ్యినట్టే కనిపించడం లేదు. హాలీవుడ్ రేంజ్‌లో విజువ‌ల్ ఎఫెక్ట్స్(Hollywood range Visual effects) ఉన్నాయంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తేజకు మ‌రో భారీ విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు. సెప్టెంబ‌రు 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.నెగిటివ్ షేడ్ లో మంచు మనోజ్ (Manchu Manoj) ఆశ్చర్యపరిస్తే తేజ సజ్జ హను మాన్ తర్వాత మరోసారి పెద్ద భాద్యతనే తనపై వేసుకున్నాడు. ఇక లాస్ట్ షాట్ లో రాముని రాకపై చూపించిన విజువల్ వర్ణనాతీతం. మొత్తానికి టీజ‌ర్ ఓ రేంజ్‌లో ర‌చ్చ చేసింది.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...