ePaper
More
    HomeజాతీయంPM Modi | ఎన్టీఆర్‌కి మోదీ నివాళులు.. ఆయ‌న నుండి ఎంతో ప్రేర‌ణ పొందామంటూ కామెంట్

    PM Modi | ఎన్టీఆర్‌కి మోదీ నివాళులు.. ఆయ‌న నుండి ఎంతో ప్రేర‌ణ పొందామంటూ కామెంట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :PM Modi | విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) 102వ జ‌యంతి సంద‌ర్భంగా కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తున్నారు. తాజాగా ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Narendra modi)కూడా ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించారు. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన నటించిన పాత్రలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ విశిష్ట నటుడని పేర్కొన్నారు.

    PM Modi | మోదీ నివాళులు..

    పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన గొప్ప దార్శనికుడని ఎన్టీఆర్‌(NTR)ని కొనియాడారు మోదీ. ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.ఆయనలో ఉన్న ప్రజ్ఞ, దార్శనికత ఆయనను విశిష్ట నాయకుడిగా నిలిపినదని ప్రశంసించారు.రామారావు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో పని చేశారని మోదీ తెలిపారు.తనకూ ఎన్టీఆర్ NTR జీవితం,సేవల నుంచి ఎంతో ప్రేరణ లభించిందని తెలియ‌జేశారు.

    నేడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్(Hyderabad NTR Ghat) వద్ద తాతకు నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛాన్ని ఉంచి, నమస్కరించి ఎన్టీఆర్‌కు వీరిద్దరూ నివాళి అర్పించారు. ఘాట్ వద్ద కాసేపు కూర్చుని తాతతో తమ మెమరీస్ నెమరు వేసుకున్నారు. సినిమా రంగానికి ,తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను వీరు గుర్తుచేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్(Kalyan Ram) వెళ్లిపోయారు. 102వ శత జయంతి వేడుకలను నందమూరి కుటుంబసభ్యులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్, తెలుగు వారు ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు.

    Latest articles

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    More like this