ipl
IPL 2025 | సేఫ్ జోన్‌లో పంజాబ్, ఆర్సీబీ.. ముంబై, గుజ‌రాత్‌కి గడ్డు ప‌రిస్థితులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | గ‌త రాత్రి ఆర్సీబీ(RCB), ల‌క్నో(Lucknow) మ‌ధ్య జరిగిన ఉత్కంఠ‌క‌ర‌మైన మ్యాచ్‌లో ఆర్సీబీని RCB విజ‌యం వ‌రించింది. దీంతో ఆ జ‌ట్టు 19 పాయింట్లు సాధించి 0.301 నికర రన్ రేట్ తో రెండవ స్థానంలో నిలిచింది.

పంజాబ్ కింగ్స్ 19 పాయింట్లు, 0.372 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లు, 0.254 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో నిలవగా, ముంబై ఇండియన్స్ 16 పాయింట్లు, 1.142 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్ 4 స్థానాలు ఫిక్స్ కావ‌డంతో ఇప్పుడు క్వాలిఫ‌య‌ర్ 1 మే 29, ముల్లన్పూర్ లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు క్వాలిఫైయర్-2లో మరో అవకాశం లభిస్తుంది.

IPL 2025 | ఇంట్రెస్టింగ్ ఫైట్..

ఎలిమినేటర్ (మే 30, ముల్లన్పూర్) లో ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ మూడు, నాల్గవ స్థానంలో నిలిచిన జట్ల మ‌ధ్య ఉంటుంది. డూ-ఆర్-డై మ్యాచ్‌లో (Do or Die) ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన త‌ప్ప‌దు, గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కి చేరుకుంటుంది. క్వాలిఫయర్-2 (జూన్ 1, అహ్మదాబాద్) లో జరుగనుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు vs ఎలిమినేటర్ విజేత ఆడ‌తాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక ఫైనల్ (జూన్ 3, అహ్మదాబాద్)లో క్వాలిఫయర్-1 విజేత vs క్వాలిఫయర్-2 విజేత జ‌ట్ల మ‌ధ్య ఉంటుంది. ఈ మ్యాచ్ ఐపీఎల్ 2025 ట్రోఫీని ఏ జట్టు గెలుస్తుందో నిర్ణయిస్తుంది.

మే 30న ముల్లాన్‌పూర్‌(Mullanpur)లో జరిగే ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మ‌ధ్య పోరు ఆస‌క్తిక‌రంగా ఉండే అవ‌కాశం క‌నిపిస్తుంది. ముంబై ఇండియన్స్ దూకుడు బ్యాటింగ్, బౌలింగ్ బలాన్ని ప్రతిబింబిస్తుంది. మరోవైపు, గుజరాత్ టైటాన్స్ సీజన్ అంతటా నిలకడను ప్రదర్శించి 9 మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఇది డూ-ఆర్-డై మ్యాచ్ అవుతుంది. రెండు జట్లు తమ శాయశక్తులా ప్రయత్నిస్తాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు సీజన్ నుంచి నేరుగా నిష్క్రమిస్తుంది. ముంబై జ‌ట్టు (Mumbai indians) మొద‌ట్లో ఓడిన ఆ త‌ర్వాత పుంజుకొని ప్లే ఆఫ్స్‌కి చేరుకుంది. మ‌రి చివ‌రలో ఆ టీమ్ ప‌ర్‌ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.