అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ఆగడం లేదు. అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై హైడ్రా అధికారులు వేగంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కొండాపూర్‌లో హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. ఆల్విన్ చౌక్ పార్క్‌లో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించి హైడ్రా అధికదరులు పార్క్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.