Symptoms of cerebral edema | తరచూ తలనొప్పి.. యమ డేంజర్.. సెరిబ్రల్ ఎడెమా లక్షణాలివి..
Symptoms of cerebral edema | తరచూ తలనొప్పి.. యమ డేంజర్.. సెరిబ్రల్ ఎడెమా లక్షణాలివి..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Symptoms of cerebral edema : ప్రస్తుత రోజుల్లో, ఎవరు ఏ వ్యాధితో బాధ పడుతున్నారో.. అది విషమించే వరకు తెలియట్లేదు. ఎన్నో రోజుల నుంచి అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నా పట్టించుకోము. అది కొన్నిసార్లు విషమించి ప్రాణాంతకంగా మారుతుంది. ప్రత్యేకించి తరచూ వచ్చే తలనొప్పిని చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది చేయి దాటే వరకూ సీరియస్ గా పరిగణించరు.

వాస్తవానికి మన ఆరోగ్యంపై మనమే ఎక్కువ శ్రద్ధ వహించాలి. దీని కోసం చాలాసార్లు మన జీవనశైలిని కూడా మార్చుకోవాలి. శరీరంలోని సిరల వాపు గురించి సీరియస్గా తీసుకోవాలి. మెదడు సిరల్లో వాపు కారణంగా రోగులు కూడా చనిపోవచ్చు. వైద్య భాష(medical language)లో ఈ వాపును సెరిబ్రల్ ఎడెమా అంటారు. దీని లక్షణాలు(symptoms) ఏమిటో తెలుసుకుందాం.

Frequent headaches : ఆ లక్షణాలు ఏమిటి?

ఆకస్మిక తలనొప్పి మెదడు నరాలలో వాపునకు సంకేతం కావచ్చు. నిరంతర తలనొప్పిని మాత్రం విస్మరించకూడదు. అలా చేయడం ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల, తీవ్రమైన తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మెదడు నరాలలో వాపు ఉంటే తరచుగా రాత్రి పూర్తిగా నిద్రపోవడంలో సమస్య ఉంటుంది. దీని కారణంగా రాత్రిపూట నిద్రపోలేము. మధ్యలో మన నిద్రకు అంతరాయం కలుగుతుంది. దీని కారణంగా మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  • మెడలో దృఢత్వం లేదా నొప్పి కూడా మెదడులోని నరాలలో వాపును సూచిస్తుంది. దీనిని విస్మరించకూడదు. అటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  • మీ BP పదే పదే పెరుగుతుంటే ఇది మెదడులోని నరాలలో వాపుకు చాలా ముఖ్యమైన సంకేతం. కాబట్టి, ఈ సంకేతాలన్నింటినీ చూసిన తర్వాత వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి.
  • ఏదైనా తిన్న వెంటనే వాంతులు లేదా వికారం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే, ఇది మీ మెదడు(Brain)లో సమస్య ఉందని సూచిస్తుంది, ఇది సాధారణం కాదు.