అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain forecast : రాష్ట్రంలో 15 రోజుల ముందుగానే రుతుపవనాలు (monsoon season) ప్రవేశించడంతో పాటు, భారీ వర్ష సూచనల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
వానాకాలం సీజన్‌లో పంటల సాగు విషయంలో రైతులకు అవసరమైన తక్షణ చర్యలపై కలెక్టర్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)తో కలిసి సీఎం దిశానిర్దేశం చేశారు. విత్తనాలు seeds, ఎరువుల fertilizers ను అందుబాటులో ఉంచడం, మిగిలిన ధాన్యంgrain సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు Indiramma houses, భూ భారతి, ఇసుక అక్రమ రవాణా వంటి కీలకమైన అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center) నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీజన్ కు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు 29, 30 తేదీల్లో కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, జూన్ 1 నాటికి నివేదికలు అందజేయాలన్నారు. రాబోయే నెల రోజులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించాల్సిందేనని స్పష్టం చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, సేకరించిన ధాన్యంపై 48 గంటల్లో రైతులకు రూ.12,184 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 90 శాతం మేరకు ధాన్యం సేకరణ పూర్తి చేయడంపై ఈ సందర్భంగా కలెక్టర్లను ముఖ్యమంత్రి అభినందించారు.
రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించే విషయంలో అక్కడక్కడ ఇబ్బందిగా మారిన విషయాన్ని ప్రస్తావించి తీసుకోవలసిన చర్యలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 29 శాతం అధిక వర్షపాతం నమోదైందని గుర్తుచేశారు. వర్షాకాలం సీజన్ ముందుగా రావడంతో ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
మిగిలిపోయిన ధాన్యం సేకరణ విషయంలో కలెక్టర్లు ప్రో యాక్టివ్‌గా ఉండాలని, వానాకాలం సీజన్‌లో తీసుకోవలసిన చర్యలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా తీసుకోవలసిన చర్యలను వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.