ePaper
More
    HomeతెలంగాణYoung India Schools | గుడ్​న్యూస్​.. ‘యంగ్ ఇండియా స్కూల్స్’ కు నిధులు విడుదల

    Young India Schools | గుడ్​న్యూస్​.. ‘యంగ్ ఇండియా స్కూల్స్’ కు నిధులు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Young India Schools | యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు (Young India Integrated Residential Schools) నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

    సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) యంగ్​ ఇండియా స్కూల్స్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కులాల వారీగా గురుకులాలు ఉన్నాయి. అలా కాకుండా కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పిల్లలను ఒక చోట చేర్చి నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా యంగ్​ ఇండియా స్కూల్స్​ కోసం తాజాగా నిధులు విడుదల(Funds Relesead) చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున రూ.4 వేలు కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    Young India Schools | మొత్తం 55 పాఠశాలలు మంజూరు

    ప్రభుత్వం తొలివిడతలో భాగంగా 55 నియోజకవర్గాలకు యంగ్​ ఇండియా రెసిడెన్సియల్​ స్కూల్స్​ మంజూరు చేసింది. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయిస్తూ.. మొత్తం 55 పాఠశాలలు నిర్మించేందుకు రూ.11 వేల కోట్లు గతంలోనే మంజూరు చేసింది. అయితే తాజాగా 20 పాఠశాలలకు నిధులు విడుదల చేసింది. ఒక్కో సమీకృత గురుకుల పాఠశాల క్యాంపస్‌ విస్తీర్ణం గరిష్టంగా 25 ఎకరాల్లో ఉంటుంది. ఈ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

    Young India Schools | నిధులు మంజూరైన నియోజకవర్గాలు

    రాష్ట్రంలో మొత్తం 55 యంగ్​ ఇండియా పాఠశాలలు మంజూరు కాగా తాజాగా 20 బడుల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. నిధులు విడుదలైన నియోజకవర్గాలు.. ఆలేరు, అశ్వారావుపేట, బాన్సువాడ, భద్రాచాలం, భువనగిరి, దేవరకొండ, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్​, మహబూబాబాద్​, మహబూబ్​నగర్​లో పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. అంతేగాకుండా మిర్యాలగూడ, పాలకుర్తి, పరిగి, పటాన్​చెరు, రాజేంద్రనగర్​, శేరిలింగంపల్లి, వేములవాడ, వర్దన్నపేట, వరంగల్​ వెస్ట్​, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పాఠశాలల నిర్మానానికి తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...