ePaper
More
    Homeఅంతర్జాతీయంUS intelligence report | ఇండియాకు పాక్, చైనా నుంచే ముప్పు.. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక...

    US intelligence report | ఇండియాకు పాక్, చైనా నుంచే ముప్పు.. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: US intelligence report | అసమాన అభివృద్ధితో ప్రపంచ దేశాలకు దీటుగా ఎదుగుతున్న ఇండియాకు (India) పొరుగు దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉంది. పాకిస్తాన్తో పాటు చైనా (Pakistan – china) నుంచి భారత్కు ముప్పు ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. చైనా, పాకిస్తాన్ తమ సైనిక సామర్థ్యాలను ఆధునీకరించడానికి, విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలు భారత్‌కు ముఖ్యమైన భద్రతా సవాళ్లుగా మారాయని 2025 వరల్డ్ థ్రెట్ అసెస్‌మెంట్ అనే పేరుతో ఇటీవల విడుదలైన యుఎస్ ఇంటెలిజెన్స్ (US intelligence report) నివేదిక తెలిపింది. ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) తర్వాత ఈ నివేదిక వచ్చింది.

    US intelligence report | చైనా ప్రభావాన్ని తగ్గించే దిశగా..

    ఇండియా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించిన నివేదిక.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఇండియాను ప్రపంచంలోనే బలోపేతం చేయడం, అదే సమయంలో సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా.. చైనా (China) ప్రభావాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదిక (US intelligence report) పేర్కొంది. ఇండియా చైనాను తన ప్రాథమిక వ్యూహాత్మక ప్రత్యర్థిగా చూస్తుండగా, పాకిస్తాన్‌ను నిరంతర భద్రతాపరమైన ఆందోళనగా చూస్తున్నదని తెలిపింది.

    US intelligence report | పాకిస్తాన్ సైనిక ఆధునికీకరణ

    రాబోయే సంవత్సరంలో పాకిస్తాన్ (Pakistan) కీలక రక్షణ ప్రాధాన్యతలను నివేదిక వెల్లడించింద.ఇ వీటిలో సరిహద్దు ఉద్రిక్తతలను నిర్వహించడం, తెహ్రిక్-ఇ తాలిబాన్ పాకిస్తాన్ (Tehreek-e Taliban Pakistan). బలూచ్ తిరుగుబాటుదారుల వంటి సమూహాల నుంచి దేశీయ ఉగ్రవాద ముప్పులను (terrorist attacks) ఎదుర్కోవడం, దాని అణ్వాయుధ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం వంటివి నివేదికలో వివరించారు. 2024లోనే పాకిస్తాన్ అంతటా తీవ్రవాద దాడుల కారణంగా 2,500 మందికి పైగా మరణించారు. పాకిస్తాన్ ఇండియాను ఒక ప్రాథమిక ముప్పుగా చూస్తూనే ఉంది. అందువల్ల భారత ఉన్నతమైన సంప్రదాయ శక్తులను అధిగమించే లక్ష్యంతో వ్యూహాత్మక అణ్వాయుధాల (strategic nuclear weapons) అభివృద్ధితో సహా దాని అణ్వాయుధ వ్యూహాన్ని పెంపొందించే ప్రయత్నాలను పాక్ ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా చైనా, యూఏఈ, టర్కీ, హాంకాంగ్, సింగపూర్ వంటి ఇతర మధ్యవర్తిత్వ దేశాలతో అనుసంధానించిన నెట్‌వర్క్ల ద్వారా పాకిస్తాన్ సున్నితమైన సాంకేతికతను పొందుతుందనే ఆందోళనలను కూడా అమెరికా ఇంటెలిజెన్స్‌ వ్యక్తం చేసింది.

    US intelligence report | చైనా ప్రపంచ సైనిక ఆశయాలు

    చైనా ఆశయాల స్పష్టమైన దృశ్యాన్ని నివేదిక వెలుగులోకి తెచ్చింది. చైనా వల్ల అమెరికాకు (United States) అత్యంత సమగ్ర సైనిక ముప్పుగా పేర్కొంది. చైనా తన సైన్యాన్ని భూమి, గాలి, సముద్రం, సైబర్, అంతరిక్షం వంటి అన్ని రంగాలలో వేగంగా అప్‌గ్రేడ్ చేస్తోంది. తూర్పు ఆసియాలో (Asia) ఆధిపత్యాన్ని సాధించడం, తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడం, ప్రపంచ స్థాయిలో అమెరికాను సవాలు చేయడమే బీజింగ్ లక్ష్యమని అమెరికా నివేదిక తెలిపింది. చైనా అణ్వాయుధాల (China nuclear weapons) నిల్వలు 600 ఆపరేషనల్ వార్‌హెడ్‌లను అధిగమించాయని అంచనా వేసింది. ఇది 2030 నాటికి 1,000 దాటుతుందని పేర్కొంది. . ఉపగ్రహ నిఘా వ్యవస్థలలో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు డ్రాగన్ అంతరిక్ష ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది. విస్తరించిన మోహరింపులకు మద్దతుగా విదేశీ సైనిక లాజిస్టిక్స్ కేంద్రాలను నిర్మిస్తోంది. చైనా, పాకిస్తాన్ (Pakistan-china) రెండూ కీలకమైన భౌగోళిక రాజకీయ సంక్షోభ కేంద్రాలుగా ఉన్నాయని, రాబోయే సంవత్సరాల్లో ప్రాంతీయ, ప్రపంచ భద్రతా గతిశీలతను గణనీయంగా మార్చే ప్రమాదముందని తేల్చింది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...