ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’పై అభిప్రాయ సేకరణ

    Kamareddy | ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’పై అభిప్రాయ సేకరణ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ఒకే దేశం- ఒకే ఎన్నిక (One Nation, One Election) అంశంపై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీజేఆర్​ స్ఫూర్తి కళాశాలలో (PJR Sphoorti College) బీజేపీ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

    ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తున్న ఒకే దేశం – ఒకే ఎన్నికపై మేధావుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విధమైన ఎన్నికలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా దేశానికి ఉపయోగపడుతుందని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ తెలంగాణ రాష్ట్ర ఇన్​ఛార్జి అవనికాంత్ పాండే (Avanikant Pandey) మాట్లాడుతూ.. కేంద్రం నిర్ణయంపై కొన్ని పార్టీలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు neelam chinna rajulu, ఒకే దేశం ఒకే ఎన్నిక జిలా ఇంచార్జి లింగారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంజిత్ మోహన్ bjp leader Ranjit mohan, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, నాయకులు వేణు, సంతోష్, రవీందర్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...