అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Vivek Ranjan Agnihotri | రోళ్లు పగిలే రోహిణి కార్తెకు ముందే వచ్చిన రుతు పవనాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి.. అసలే అరేబియా తీరాన ఉండే ముంబై(Mumbai).. ఆపై తొలకరి.. ఇక చెప్పేదేముంది?
మహా నగరం మునిగింది. ఆర్థిక రాజధానిలో కుండపోతగా వాన పడుతోంది. శనివారమే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 16 ఏళ్లలో ఈసారి అత్యంత త్వరగా వచ్చాయి. ఇవి క్రమంగా విస్తరిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంబై నగరం Mumbai మొత్తం తడిసిముద్దైంది. ముంబైలోని ప్రధాన ప్రాంతాలైన కుర్లా, సియోన్, దాదర్, పరేల్‌లోని అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లోని వీధులు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
Vivek Ranjan Agnihotri | వర్షాలే వర్షాలు..
దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలను మొదలు పెట్టింది. మరోవైపు రాబోయే కొద్ది గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అంచనా వేయయడంతో ప్రజలు తమ పనులు వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజిక్కోడ్, వయనాడ్, కన్నూర్ జిల్లాలలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, కూడిన భారీ వర్షాలు Heavy Rains పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక ముంబైలోని పాష్ ఏరియాగా చెప్పుకునే పెడ్డర్ రోడ్ pedder road వరదలతో నిండిపోయింది. చిన్నపాటి చెరువుని తలపిస్తుంది. దీంతో ఫిలిం మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి(Filmmaker Vivek Ranjan Agnihotri) తన సోషల్ మీడియాలో సెటైరికల్ కామెంట్స్ చేశాడు.
“పెద్దర్ రోడ్ ముంబైలోని అత్యంత ధనిక ప్రాంతాలలో ఒకటి, ఈ ప్రాంతాలలో కారు తేలడం కోసం చదరపు అడుగుకి లక్ష రూపాయలు వెచ్చించండి” అని సెటైరికల్ కామెంట్ చేశారు. అంటే ఇంత కాస్ట్‌లీ ఏరియాలో డ్రైనేజ్ Drainage పరిస్థితి ఎలా ఉందో వీడియోతో పాటు తన కామెంట్‌తో తెలియజేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం వివేక్ రంజన్ అగ్నిహోత్రికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.