అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) మంగళవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరికి భారీ నష్టాల్లో ముగిశాయి.
ఉదయం 138 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్(Trading) ప్రారంభించిన సెన్సెక్స్ ఇంట్రాడేలో గరిష్టంగా 1,055 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 45పాయింట్ల నష్టంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 297 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి. కనిష్ఠాల నుంచి సెన్సెక్స్(Sensex) 1200 పైగా పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 350 పైగా పాయింట్లు పెరిగింది. మార్కెట్ రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. చివరికి సెన్సెక్స్ 624 పాయింట్ల నష్టంతో 81,551 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు నష్టంతో 24,826 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్ఈ(BSE) లో నమోదైన కంపెనీలలో 1,957 లాభాలతో ముగియగా 1,979 నష్టపోయాయి. 148 ఫ్లాట్ గా ఉన్నాయి. 89 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ట్రేడ్ అవ్వగా.. 26 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద ట్రేడ్ అయ్యాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit) ను తాకగా 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్ వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ. 1.81 లక్షల కోట్లకుపైగా తగ్గింది.
కోవిడ్ భయాలు, జియో పొలిటికల్ టెన్షన్స్(Geo political tensions) పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండడంతో ప్రధాన ఇండెక్స్‌లు నష్టాల బాటలో పయనించాయి.
Stock Market | లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో భారీ సెల్లింగ్..
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు లాభాలతో ముగిసినా లార్జ్ క్యాప్ స్టాక్స్(Large cap stocks)లో సెల్లింగ్‌తో సూచీలు నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం పెరగ్గా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.57 శాతం నష్టపోయింది. టెలికాం(Telecom) ఇండెక్స్ 0.78 శాతం పెరగ్గా.. క్యాపిటల్ గూడ్స్ సూచీ 0.42 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.32 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.25 శాతం లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ(FMCG) ఇండెక్స్ 0.79 శాతం క్షీణించగా.. ఐటీ ఇండెక్స్ 0.68 శాతం, ఆటో ఇండెక్స్ 0.66 శాతం నష్టపోయాయి. బ్యాంకెక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ తదితర సూచీలు అర శాతానికిపైగా పడిపోయాయి.
Stock Market | Top losers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ఐదు స్టాక్స్ మాత్రమే లాభాలతో ముగియగా.. 25 స్టాక్స్ నష్టపోయాయి. అత్యధికంగా అల్ట్రాటెక్ సిమెంట్ 2.21 శాతం పడిపోగా ఐటీసీ(ITC) 2.01 శాతం నష్టపోయింది. టాటా మోటార్స్ 1.73 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.59 శాతం పడిపోయాయి. ఎన్టీపీసీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్ టెక్, ఎటర్నల్(Eternal), బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఒక శాతానికిపైగా నష్టపోయాయి.
Stock Market | Top gainers..
ఇండస్ ఇండ్ బ్యాంక్(Indusind bank) 2.60 శాతం పెరిగింది. సన్‌ఫార్మా 0.42 శాతం, అదాని పోర్ట్స్ 0.34 శాతం, నెస్లే 0.33 శాతం లాభపడ్డాయి.