ePaper
More
    HomeతెలంగాణNizamabad City | పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలి

    Nizamabad City | పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన మురుగు కాలువల్లో పూడికతీత పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశించారు.

    మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy), నూడా ఛైర్మన్ కేశ వేణుతో (NUDA Chairman) కలిసి పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. నూతనంగా నిర్మించాల్సిన మురుగు కాలువల ప్రతిపాదిత స్థలాలను పరిశీలించి, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

    ఆక్రమించుకొని కట్టిన నిర్మాణాలను పరిశీలించి వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అవకాశమున్నచోట జేసీబీ వినియోగించాలని, వీలుకాని చోట పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించాలన్నారు.

    గతంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. కలెక్టర్ వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ (Chairman of the State Urdu Academy) తాహెర్ బిన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ (State Agricultural Commission) సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ (Chairman of the District Library Association)​ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఈఈ ఆనంద్ సాగర్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి దుర్మరణం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్​లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram)...

    Meenakshi Natarajan | పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపు

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Meenakshi Natarajan | పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని...

    Medical College | మెడికల్​ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో నం.33ని అమలు...

    Earthquake in russia | రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన అగ్ని పర్వతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake in russia | రష్యాలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం...

    More like this