అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్ భూములను కాపాడాలని కోరుతూ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు ధర్నా చేశారు.
అనంతరం ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు భిక్షపతి(Tahsildar Bikshapathi)కి వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్ట్ భూములను ఇతర నియోజకవర్గాలకు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి అచ్చంపేట శివారులో 680 ఎకరాల భూమి ఉందని.. అందులో ప్రస్తుతం జవహర్ నవోదయ, తెలంగాణ మోడల్ స్కూల్, పల్లె ప్రకృతి వనం, నర్సరీలు ఉన్నాయన్నారు.
మిగిలి ఉన్న భూమిని సైతం జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ దుర్గారెడ్డితో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, సొసైటీ ఛైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.